Advertisementt

ఈ హీరో వర్మ కే ఫిటింగ్ పెట్టాడు..!

Wed 16th Dec 2015 10:34 AM
ram gopal varma,raj tarun,raj tarun direction with ram gopal varam story,rgv  ఈ హీరో వర్మ కే ఫిటింగ్ పెట్టాడు..!
ఈ హీరో వర్మ కే ఫిటింగ్ పెట్టాడు..!
Advertisement
Ads by CJ

దర్శకుడవ్వాలని చిత్రసీమలో అడుగుపెట్టి అనుకోకుండా హీరో అయిపోయాడు రాజ్‌తరణ్‌. అయితే హీరోగా వరుస విజయాలతో దూసుకుపోయి... హీరోగానే సెటిలైపోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడు. అయితే ఆయనకు దర్శకత్వంపై మమకారం పోలేదు. త్వరలోనే రాజ్‌తరుణ్‌ డైరెక్టర్‌గానూ తన శైలి చూపించబోతున్నాడు. ఆమధ్య దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ.. రాజ్‌తరుణ్‌ కోసం ఓ స్టోరీ తయారుచేసుకొని ఆయనకు వినిపించాడు. ఆ కథ రాజ్‌తరుణ్‌కు బాగా నచ్చింది. దాంతో ఆయన ఈ కథ నాకు ఇవ్వండి... నేనే డైరెక్ట్‌ చేస్తాను అని వర్మను కోరాడట. దానికి వర్మ కూడ తన అంగీకారం తెలిపాడని టాక్‌. సో.. వర్మ కథతో రాజ్‌తరుణ్‌ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోందన్నమాట..! మరి ఆ చిత్రంలో రాజ్‌తరుణే హీరోగా నటిస్తాడా? లేక వేరే హీరోను తీసుకుంటాడా? అనేది తెలియాల్సివుంది. కాగా ఈ చిత్రాన్ని వర్మనే స్వయంగా నిర్మించే అవకాశం ఉంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ