నేను చిరంజీవిగారిని మాస్ స్టార్‌గా చూపించాలని ఆశపడుతున్నాను. కానీ ఆయన మాత్రం సోషల్ మెసేజ్ కావాలంటున్నాడు. అదే మా ఇద్దరి మధ్యన సినిమా కాకుండా ఆపుతోంది. ఆయన ఎప్పుడూ మెసేజ్ కావాలంటున్నారు. నాకు జనాలను మసాలాలతో ఎంటర్‌టైన్ చేయడం మాత్రమే వచ్చు.... అంటున్నాడు పూరీజగన్నాధ్. ఆయన ఇంకా మాట్లాడుతూ... అయినా ఆయనతో 150వ చిత్రమే చేయాలనే పట్టుదల నాకేమీ లేదు. 150 కాకపోతే 151వ సినిమా అదీ వీలుకాకపోతే 152వ సినిమా చేస్తాను. చిరంజీవి గారితో చేయడం అనేది నా లక్ష్యం. అంతేగానీ ఫలానా నెంబర్ ఉన్న సినిమానే చేయాలనే ఆలోచన లేదు... అంటూ వివరణ ఇచ్చాడు. మొత్తానికి 'అఖిల్' అట్టర్‌ఫ్లాప్ అయినప్పటికీ చిరంజీవి 150వ చిత్రానికి వినాయకే దర్శకత్వం వహించనున్నాడని, ఇందుకోసం పరుచూరి గోపాలకృష్ణ తమిళ 'కత్తి' కథకు కావాల్సిన రిపేర్లు చేస్తున్నాడని సమాచారం. ఈ విషయాన్ని చూచాయగా రామ్‌చరణ్ సైతం తెలిపిన విషయం తెలిసిందే.