'ఓకే బంగారం' హిట్టయిన తర్వాత మరలా ఫామ్‌లోకి వచ్చిన మణిరత్నం తదుపరి చిత్రంపై రోజుకో వార్త వస్తోంది. ఆయన కార్తీ-దుల్కర్‌సల్మాన్‌ల కాంబినేషన్‌లో ఓ చిత్రం చేయనున్నాడని వార్తలు వచ్చాయి. ఆ వెంటనే కార్తీ-నానిలతో ఆ చిత్రం ఉంటుందని అన్నారు. మధ్యలో ఆయన విక్రమ్‌తో సినిమా చేయనున్నాడని కూడా ప్రచారం జరిగింది. తాజాగా అయితే ఆయన తమిళం, తెలుగులను కాదని ఓ బాలీవుడ్ సినిమాను తెరకెక్కించే యోచనలో ఉన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. కానీ మణిరత్నం తన తదుపరి చిత్రాన్ని కార్తీ హీరోగా తెరకెక్కించనున్నాడని పక్కా సమాచారం. ఇప్పుడు ఇదే విషయమై కోలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. కార్తితో అయితే తమిళంతో పాటు తెలుగులో కూడా మార్కెట్ ఉంటుందని భావించిన మణిరత్నం ఓ కొత్త కథతో కార్తితో సినిమా చేయడం గ్యారంటీ అనేది తాజా సమాచారం.