Advertisementt

ఆమె పట్ల బన్నీ మనసు కదిలింది!

Tue 15th Dec 2015 07:07 PM
allu arjun,mastan bee,vijayawada,cancer patient  ఆమె పట్ల బన్నీ మనసు కదిలింది!
ఆమె పట్ల బన్నీ మనసు కదిలింది!
Advertisement
Ads by CJ

అభిమానులకు ఇసుమంత బాధ కలిగినా తమ మనసు చివుక్కుమనే హీరోలు ఇంకా మన మధ్యే ఉన్నారు. ట్రీట్మెంట్ అంటూ లేని ప్రాణాంతకమైన రోగాల బారిన పడిన ఎంతో మంది అభిమానులకు చేతనైనంతలో ఆర్థికంగా సహాయ పడడమో లేక వారి ఆఖరి రోజుల్లో గుండె ధైర్యాన్ని నింపి చివరి కోరికలని తీర్చటానికో మన హీరోలు సమయం కేటాయిస్తుంటారు. అల్లు కుటుంబం పట్ల, మెగా ఫ్యామిలీ పట్ల ఎంతో ప్రేమ పెంచుకున్న మస్తాన్ బీ అనే ఒక వయసు పై బడ్డ క్యాన్సర్ పేషెంటుని పరామర్శించడానికి అల్లు అర్జున్ నేడు స్వయంగా విజయవాడలోని సింగ్ నగర్ చేరుకున్నారు. మస్తాన్ బీకి చాన్నాళ్ళుగా అల్లు కుటుంబంతో సాన్నిహిత్యం కలిగి ఉంది. అల్లు రామలింగయ్య, చిరంజీవి గార్లంటే ఆమెకు వల్లమాలిన అభిమానం. ఓ టీవీ చానల్ ద్వారా మస్తాన్ బీ విషయాన్ని తెలుసుకున్న బన్నీ వెంటనే సరైనోడు సినిమా షూటింగ్ బ్రేక్ దొరగ్గానే విజయవాడ పయనమయి తన అభిమానిని కలుసుకుని పరామర్శించారు. బన్నీని చూసిన ఆనందంలో ముసలవ్వ ఉబ్బితబ్బిబయింది. అలాగే అల్లు అర్జున్ కూడా ఎంతో ఆత్మీయంగా కదలడం అందరి దృష్టినీ ఆకర్షించింది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ