దర్శకుడు సంపత్ నంది పట్ల హీరోయిన్ తమన్నాకున్న అభిమానం, నమ్మకం అంతా ఇంతా కాదు. ఇప్పుడున్న దర్శకులలో సంపత్ నందిని నమ్మినంతగా తమన్నా ఇంక ఎవరినీ నమ్మదనడం సరైనదే. ఎందుకంటే రచ్చతో మాస్ జనాలను ఉర్రూతలూగించిన సంపత్ మళ్ళీ మొన్న బెంగాల్ టైగర్ అంటూ కూడా మంచి విజయం అందుకున్నాడు. మాస్ మసాలా అంశాలను డీల్ చేయడంలో సంపత్ స్టైల్ నాకు బాగా నచ్చుతుంది అని తమన్నా పలుమార్లు అనడం మనం విన్నాం. నిజానికి బెంగాల్ టైగర్ కథ కూడా వినకుండా తమన్నా ప్రాజెక్టు ఓకే చేసిందంటే కేవలం సంపత్ మీదున్న కాన్ఫిడెన్స్ వల్లే. మరి ఇప్పుడేమో సంపత్ తదుపరి ప్రాజెక్టు రామ్ చరణ్ కోసమే అన్నట్టుగా విపరీతమైన ప్రచారం సాగుతోంది. మరి ఈ సినిమాలో కూడా తమన్నానే హీరోయినుగా ఎంచుకుంటాడా? వీరిద్దరి కలయికలో ప్రత్యేకం ఏమిటంటే తమన్నా సొగసరి అందాలని చక్కగా అలంకరించి తెరమీద చిక్కగా ఆవిష్కరించిన కొద్దిపాటి మేటి దర్శకులలో సంపత్ అగ్రగణ్యుడు. అటు జడివానలో తడిఅందాలను, ఇటు దేహంతో ధూపాన్నిచ్చిన వీరిద్దరికి మరోసారి గనక రామ్ చరణ్ తోడయ్యాడంటే రచ్చ రచ్చే...