ఒక్క టిక్కెట్టు మీద రెండు సినిమాలు చూసినట్టే ఒక్క సినిమా ఖర్చులో రెండు సినిమాలు చేసి ఇస్తామనే టెక్నికల్ టీం దొరకడం నిజంగా నిర్మాతగా స్రవంతి రవికిషోర్ అదృష్టం అనాలో దురదృష్టం అనాలో తెలీడం లేదు. శివం పేరుతో మొదటిది డుంకీ కొట్టడంతో కిషోర్ తిరుమల దర్శకత్వంలో సేం టు సేం టీముతో నేను శైలజను తయారు చేసారు. నిజానికి దీని పేరు ముందుగా హరికథ అనుకున్నా ఫైనలుగా నేను శైలజా ఫిక్స్ చేసారు. శివం రిజల్టు అయితే ఫ్లాప్ కానీ నిర్మాత రవికిషోర్, హీరో రామ్ ఏ మాత్రం నష్ట పోలేదన్నది ఇన్నర్ న్యూస్. మొదటి సినిమాతోనే రెండు సినిమాల పెట్టుబడిని బయ్యర్స్ నుండి రాబట్టుకున్నారట. అందుకే నేను శైలజ నిర్మాణం కోసం ఫైనాన్సు విషయంలో కూడా వీరు పెద్ద ఇబ్బంది పడింది లేదు. ఇప్పుడు నేను శైలజ బాక్సాఫెస్స్ ఫలితం ఎలా ఉన్నా, రామ్ ఫేస్ వ్యాల్యూ మీద ఓపెనింగ్స్ వరకైతే డోఖా ఉండకపోవచ్చు. అంటే నేను శైలజ మీద మొదటి రోజు నుండి వచ్చే ప్రతి రూపాయి వీరికి లాభం కిందే లెక్క. అందుకే కాబోలు వీళ్ళు ప్రమోషన్స్ కూడా నెమ్మదిగా చేసుకుంటున్నారు. ఇదే మరి ఒక్క దెబ్బకు రెండు సరసమైన పిట్టలంటే!