హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్ నిర్దోషిగా బయటపడ్డాడు. కొన్నేళ్లుగా సాగుతున్న ఈ కేసు ఎట్టకేలకు ముగిసింది. సల్మాన్ అమాయకుడని స్పెషల్ కోర్టు తీర్పు వెలువరించడంతో సల్మాన్ అభిమానుల్లో, కుటుంబంలో కోలాహలం మొదలైంది. గండం గడిచింది, తదుపరి ఏంటంటే సల్మాన్ ఖాన్ ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి అంటున్నాయి ముంబై ఫిలిం వర్గాలు. రొమేనియా టీవీ యాంకర్ లులియా వాంతూరుతో మన కండల వీరుడు, ఏజ్ బార్ బ్యాచిలర్ పెళ్లాండేందుకు సిద్ధం అవుతున్నాడు అన్న ప్రచారం అంతటా జరుగుతున్నది. ఇప్పటికే వీళ్ళిద్దరికీ మధ్య లస్కుటపా నడుస్తుంది అన్న విషయం మనకు తెలిసినా కేసు నుండి సల్మాన్ బయటపడే వరకు ఎవరూ మాట్లాడలేదు. అంతా తమ అనుకూలంగానే రావడంతో సల్మానుని కుటుంబ సభ్యులు ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేసి వచ్చే ఏడాది అంటే 2016లో వివాహానికి ఓకే చెప్పించినట్టు కొన్ని పత్రికలు ముఖ్య కథనాన్ని ప్రచురించాయి. పెళ్లి ఎప్పుడని మీడియా అడిగిన ప్రతిసారీ దాటవేసే సల్మాన్ మరీసారి ఏం చెప్పినా తప్పించుకోలేడు.