Advertisementt

పూరి జగన్నాథ్ ఏడ్చేశాడు!

Tue 15th Dec 2015 02:16 PM
puri jagannadh,director,dogs,puri jagannadh friend,puri jagannadh crying,loafer,puri biography  పూరి జగన్నాథ్ ఏడ్చేశాడు!
పూరి జగన్నాథ్ ఏడ్చేశాడు!
Advertisement
Ads by CJ

కష్టపడి సంపాందించుకున్న కోట్ల ఆస్తులు.. డబ్బు అన్నీ ఉన్నట్టుండీ మాయం అయిపోతే.. ఎవరికైనా జీవితం మీద విరక్తి కలుగుతుంది.. ఏడుపు దానంతటా అదే తన్నుకుంటూ వచ్చేస్తుంది.. ఇదే అనుభవం స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా జరిగింది. అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకుల్లో ఒకరిగా వున్న పూరి ఎనిమిదేళ్ల క్రితం ఓ స్నేహితుడి కారణంగా మోసపోయాడు. సంపాదించిన ఆస్థిపాస్థులు అన్నీ కొల్పోయాడు. ఈ విషయం గురించే ఇటీవల పూరి మాట్లాడుతూ  ‘ఎనిమిదేళ్ల క్రితం హఠాత్తుగా ఇల్లు,ఆఫీసు అన్నీ అమ్ముకున్నాను. అంతేకాదు నేను ప్రేమగా చూసుకునే కుక్కలకు ఆహారం కూడా పెట్టలేకపోయాను. అందుకే కుక్కలను కూడా వేరే వాళ్లకు ఇచ్చేశాను. ఆ రోజు మొత్తం ఏడ్చేశాను.  నా పరిస్థితి చూసి కుక్కలను తీసుకున్న అతనికి కూడా ఏడుపొచ్చింది. ఇక అప్పటి నుంచే నాలో మరింత కసి పెరిగింది. అందుకే ఎక్కువ పనిచేయాలనుకున్నాను. వెంట వెంటనే సినిమాలు చేస్తూ వస్తున్నాను. ఇప్పుడు నా ఫైనాన్షియల్ పరిస్థితి చాలా హ్యాపీగా వుంది’ అని చెప్పుకొచ్చాడు పూరీ జగన్నాథ్.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ