పేరుకి సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడే కానీ తన ప్రతిభతోనే పైకి వచ్చిన నటుడు ధనుష్. తమిళంలో స్టార్‌గా ఉన్న అతను తెలుగులో మార్కెట్ పెంచుకోవడానికి చాలాకాలం నుంచి ట్రై చేస్తున్నాడు. ఈమద్యకాలంలో వచ్చిన 'రఘువరన్ బి.టెక్' తప్ప ఏదీ సరిగా ఆడలేదు. అయితే అతను తన దృష్టిని ఇక్కడే పూర్తిగా పెడుతున్నాడు. అందుకేనేమో ఇక్కడ తాజాగా రిలీజ్ చేస్తున్న 'నవ మన్మథుడు' చిత్రాన్ని ఎలాగైనా జనాల్లోకి తీసుకువెళ్లాలనుకుంటున్నాడు. అందులో భాగంగా ఓ రెండు పాటలను స్వయంగా తెలుగులో పాడుతున్నాడు. అతను గతంలో పాడిన 'కొలవరి డి' మొత్తం సంగీత ప్రపంచాన్నే ఉర్రూతలూగించింది. ఇదే ఉత్సాహంతో తెలుగులో ఓ రెండు పాటలు పాడాలనుకుంటున్నాడు. తమిళ సినిమా 'తంగమగన్'కు తెలుగు అనువాదంగా 'నవ మన్మథుడు' రాబోతోంది. కాగా 'కొలవరి..' పాటకు సంగీతం అందించిన సంగీత సంచలనం అనిరుధే ఈ చిత్రానికి కూడా సంగీతం అందిస్తుండటం విశేషం.