Advertisementt

ప్రభాస్‌ వస్తాడా..?

Mon 14th Dec 2015 07:40 PM
prabhas,u.v.creations,express raja movie audio function,prabhas guest,pawan kalyan fans  ప్రభాస్‌ వస్తాడా..?
ప్రభాస్‌ వస్తాడా..?
Advertisement
Ads by CJ

స్టార్‌హీరో ప్రభాస్‌ తన కజిన్‌ ప్రమోద్‌ ఉప్పలపాటి తన స్నేహితుడితో కలిసి యువి క్రియేషన్స్‌పై సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. వీరు ప్రొడ్యూస్‌ చేసిన 'రన్‌రాజారన్‌, జిల్‌' సినిమాల ఆడియో ఫంక్షన్లకు ప్రభాస్‌ ముఖ్యఅతిథిగా విచ్చేశాడు. అలాగే ఇప్పుడు మరో చిత్రం ఆడియోకు కూడా హాజరుకానున్నట్లు సమాచారం. యువి క్రియేషన్స్‌ బేనర్‌లో తాజాగా నిర్మించిన 'ఎక్స్‌ప్రెస్‌రాజా' చిత్రం ఆడియోకు ప్రభాస్‌ ముఖ్య అతిధిగా రానున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రీసెంట్ గా ప్రభాస్ హాజరయిన 'లోఫర్' ఆడియో ఫంక్షన్ లో పవన్ ఫ్యాన్స్ వలన ఎంత ఇబ్బంది పడ్డాడో.. తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రభాస్ మరో ఆడియో ఫంక్షన్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయా.. అంటే లేవనే చెప్పాలి. మరి ప్రభాస్ వస్తాడో.. రాడో తెలియాలంటే డిసెంబర్‌ 19 వరకు వేచి చూడాల్సిందే.. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా 'వెంకటాద్రిఎక్స్‌ప్రెస్‌' దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ