నిర్మాతగా సి కళ్యాణ్ అంటే చిల్లర కళ్యాణ్ అని మనకు తెలిసినా ఆయనతో వైరం పెట్టుకున్న వాళ్లకు మాత్రం కాంట్రవర్సరీ కళ్యాణ్ అయిపోతారు. అందుకే లోఫర్ నిర్మాతగా సినిమాను ప్రమోట్ చేసుకునే క్రమంలో తన పర్సనల్ విషయాల పట్ల కూడా జంకు బొంకు లేకుండా ముక్కుసూటిగా స్పందించారు. స్ట్రెయిట్ ఫార్వర్డుగా మాట్లాడితే ఎదుటివారికి బాధ కలగొచ్చు. కానీ అది నా తత్వం. నాలో తప్పుంటే తల దించుకుని, సరెండర్ అయి సారీ చెప్పి వెళ్ళిపోతా. అదే నా తప్పు లేకపోతే మాత్రం వాడి అంతు చూసే వరకు నిద్రపోను. దీనికోసం నాకు ఫ్యాక్షనిస్టుల అవసరం లేదు. వాడు నాకు స్పాట్ పెట్టాలనుకునే లోపే నేనే వాడికి స్కెచ్ గీసి స్పాట్ పెట్టేస్తా. ఈ విషయంలో నన్ను అందరూ రౌడీ అనుకోవచ్చు. అలాగని నా సహాయం కోరి వచ్చిన వారికి మాత్రం నేను మరోలా కనపడతాను. ఎందుకంటే నేను ఆ దేవుడిని ఎక్కువగా నమ్ముతాను. మనం చేసే ప్రతి పని ఆయనే చేయిస్తాడు. ఏది జరగాలో అది జరుగుతుంది అని నమ్మే వ్యక్తిత్వం నాది అంటూ నిజంగా పూరి జగన్నాథ్ సినిమా డైలాగులు పేలినట్టుగా కళ్యాన్ గారు పేలారు. పూరితో సహవాస దోషం కాబోలు.