సినిమాలలో తన హీరోలకు మాటలు రాసినట్టే నిజ జీవితంలో కూడా పూరి జగన్నాథ్ మాటలు తూటాల్లా పేలుతాయి. మనసులో ఏమీ ఉంచుకోడు. ఉన్నది ఉన్నట్టు ఖరాఖండీగా మాట్లాడే తత్వం మంచిదే అయినా, అన్ని సమయాల్లో ఇది పనికిరాక పోవచ్చు. నిన్న జరిగిన ఇంటర్వ్యూలో పవర్ స్టార్ అభిమానుల పట్ల పూరి జగన్నాథ్ చేసిన కామెంట్స్ చానా మందికి బాధ కలిగించాయి. పవన్ కళ్యాణ్ ఓసారి అభిమానులతో మాట్లాడితే బాగుంటుంది అన్నదానికి, లేకుంటే ఆయన అభిమానులకు కామన్ సెన్స్ లేదని అనుకుంటారు అని అనేదానికి చాలా వ్యత్యాసం ఉంది. పూరి మాత్రం తెలివిగా రెండూ అనేసాడు. ఎవరు ఎలా తీసుకున్నా నాకేం తేడా లేదు అనే వ్యక్తిత్వం ఆయనది. వారం రోజుల్లో లోఫర్ రిలీజు పెట్టుకొని ఇప్పుడు పవన్ అభిమానులతో పూరి పంగా ఎందుకు పెట్టుకుంటున్నాడో తెలియడం లేదు. కొందరు కరడుగట్టిన పవర్ స్టార్ ఫ్యాన్స్ మూకుమ్మడిగా లోఫర్ మీద దుష్ప్రచారం చేసేందుకు పూనుకున్నా ఎవరు ఆపగలరు. అలాగే ఇందులో ఏ కొద్ది మంది అయినా సినిమాను బాయ్ కాట్ చేస్తే రెవెన్యూ దెబ్బతినే అవకాశం కూడా లేకపోలేదు. అభిమానులని మరీ అంత తేలిగ్గా తీసి పారేస్తే ఎట్లా పూరీ?