గడ్డు పరిస్థుతులు రామ్ చరణ్ కెరీరుని చాలా తరచుగా పలకరిస్తుంటాయి. సూపర్ డూపర్ హిట్లు వచ్చినా చరణ్ తదుపరి సినిమాకు అన్ని లెక్కలు మారిపోతుంటాయి. మగధీర తరువాత చరణ్ అనుభవించిన క్షోభ మనకు తెలియనిది కాదు. అటువంటి కష్ట సమయంలో సంపత్ నంది ఇచ్చిన రచ్చతో చరణ్ పుంజుకున్నాడు. ఇప్పుడు కూడా అదే సిట్యువేషన్ రిపీట్ అవనుందా? గోవిందుడు అందరి వాడెలే, బ్రూస్ లీ అపజయాలతో చతికిలబడ్డ రామ్ చరణ్ మరోసారి బెంగాల్ టైగర్ అంటూ హిట్టు కొట్టిన దర్శకుడు సంపత్ నందితో జట్టు కట్టనున్నాడా? నిజమే అంటున్నాయి సినీ వర్గాలు. ముందుగా తని ఒరువన్ తెలుగు రీమేక్ పనులను ప్రారంభించారు కనక, ఈ ప్రాజెక్టు పట్టాల పైన ఉండగానే సంపత్-చరణ్ సినిమా చర్చలు ముగిసి అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. మరోసారి చరణ్ బాబుని కష్టాల నుండి సంపత్ గట్తెక్కిస్తాడా?