Advertisementt

ఇదేనా అల్లుడు శీను కొత్త టైటిల్!

Sun 13th Dec 2015 03:56 PM
bellamkonda sai srinivas,speedunnodu,bheemaneni srinivas rao  ఇదేనా అల్లుడు శీను కొత్త టైటిల్!
ఇదేనా అల్లుడు శీను కొత్త టైటిల్!
Advertisement
Ads by CJ

 

ఎన్ని రకాలుగా చూసుకున్నా అల్లుడు శీను సినిమా బెల్లంకొండ సాయి శ్రీనివాసుకి అద్భుతమైన డెబ్యూ ప్లాట్ ఫారం ఇచ్చిందనే చెప్పాలి. ఆ సమయంలో తండ్రి, నిర్మాత బెల్లంకొండ సురేష్ భారీగా ఖర్చు పెట్టిన తీరు చూస్తే సాయి మీద పెట్టుకున్న నమ్మకం సరైనదనే అనుకోవచ్చు. అటు తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో సాయి మొదలెట్టిన రెండో ప్రాజెక్టు ఆరంభశూరత్వంగానే మిగిలిపోయింది. ఎందుకంటే ప్రస్తుతం బోయపాటి గారేమో అల్లు అర్జునుతో సినిమా తీస్తుంటే భీమనేని శ్రీనివాస్ గారేమో సాయితో పని చేస్తున్నారు. ఇక్కడ యాదృచ్చికం ఏంటంటే, బన్నీ సినిమా పేరు సరైనోడు అని పెట్టుకుంటే సాయి రెండో చిత్రానికి స్పీడున్నోడు అని నామకరణం చేసారట. కొడుకు కెరీర్ ఊపు తగ్గిపోతుందన్న భయంతో సురేష్ గారు స్పీడున్నోడు సినిమాను ఫుల్ స్పీడులో తీసేస్తున్నారు. అన్నీ కుదిరితే సంక్రాంతికే రావాల్సింది. కానీ లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే. స్పీడున్నోడు ఖచ్చితంగా ఫిబ్రవరిలో రిలీజవనుంది. ఈ స్పీడున్నోడు, సుందర పాండ్యన్ తమిళ చిత్రానికి రీమేక్ అన్న విషయం మనకు తెలిసిందే.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ