Advertisementt

ఆ సినిమా ‘దూకుడు’ కాదు ఆగడు!

Sun 13th Dec 2015 02:26 PM
sankarabharanam,nikhil,dookudu,aagadu,kona venkat,sankarabharanam result  ఆ సినిమా ‘దూకుడు’ కాదు ఆగడు!
ఆ సినిమా ‘దూకుడు’ కాదు ఆగడు!
Advertisement
Ads by CJ

వైవిధ్యమైన చిత్రాలు చేసుకుంటూ వరుస విజయాలు సాధిస్తున్న యువ కథానాయకుడు నిఖిల్ విజయపరంపరకు కోనవెంకట్ ‘శంకరాభరణం’తో బ్రేక్ వేశాడు.! నూతన దర్శకులకు, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్‌లతో.. మినిమమ్ బడ్జెట్‌లతో సినిమాలు చేసిన నిఖిల్ వరుసగా మూడు విజయాలు లభించాయి. అయితే ఈ కుర్రహీరో ఎప్పుడైతే కోనవెంకట్ అండ్ కో కాంబినేషన్‌కు టెంప్ట్ అయ్యాడో.. చేతులారా అపజయాన్ని మూటగట్టుకున్నాడు. అయితే ఈ సినిమా విషయంలో కోనవెంకట్, చిత్ర నిర్మాత బాగానే లాభపడ్డారు. మంచి ఫ్యాన్సీ రేట్లకు బిజినెస్ చేశారు. కానీ బయ్యర్స్ మాత్రం ‘శంకరాభరణం’ విషయంలో ఘోరంగా నష్టపోతున్నారనేది ట్రేడ్‌టాక్. అయితే మొదట్నుంచీ ప్రతి ప్రెస్‌మీట్‌లో మహేష్‌బాబుకు ‘దూకుడు’లా నిఖిల్‌కు శంకరాభరణం అని చెబుతున్న కోన డైలాగ్‌కు ఇప్పుడు అందరూ అది దూకుడు కాదు ఆగడు అంటూ సెటైర్స్ వేస్తున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ