Advertisementt

ప్రభాస్ కాదనలేకపోతున్నాడు!

Sun 13th Dec 2015 11:14 AM
prabhas,bahubali craze,garam teaser launch,loafer audio launch,young rebel star  ప్రభాస్ కాదనలేకపోతున్నాడు!
ప్రభాస్ కాదనలేకపోతున్నాడు!
Advertisement
Ads by CJ

‘బాహుబలి’ చిత్రంతో టాలీవుడ్ నెంబర్‌వన్ కమర్షియల్ హీరోగా ఎదిగాడు ప్రభాస్. ఈ చిత్రం తర్వాత ఈ యంగ్ రెబల్‌స్టార్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ప్రభాస్ పాపులారిటీతోనే అతనికి చిక్కులు వచ్చి పడ్డాయి. ప్రభాస్ పరిచయమున్న దర్శకులు, హీరోలు, నటులు ఆయన్ని ఆడియో ఫంక్షన్‌లకు, ఇతర వేడుకలకు పిలిచి మోహమాట పెట్టేస్తున్నారట. ఇటీవల కొన్ని ఆడియో ఫంక్షన్లకు హాజరైన ప్రభాస్.. సెక్యూరిటీ పరంగా కొన్ని ఇబ్బందులు కూడా పడ్డాడని అతని సన్నిహితులు చెబుతున్నారు. ఇటీవల సాయికుమార్ కూడా తన తనయుడు ఆది హీరోగా రూపొందుతున్న ‘గరం’ చిత్రం టీజర్‌ను ప్రభాస్ చేత ఆవిష్కరింపజేసిన సంగతి తెలిసిందే. అయితే..ఇప్పటి వరకు వారితో వున్న పరిచయం కారణంగా వారిని ప్రభాస్ కాదనలేక ఒప్పుకుంటున్నాడని.. ఇక నుంచి ఇలాంటి వేడుకలకు దూరంగా వుండాలని ప్రభాస్ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు ఆయన సన్నిహితులు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ