Advertisementt

టైటిల్ మారిస్తే..ఫేట్ మారుతుందా!

Sun 13th Dec 2015 10:56 AM
hero ram,nenu sailaja,kishore,harikatha,hero ram new movie nenu sailaja  టైటిల్ మారిస్తే..ఫేట్ మారుతుందా!
టైటిల్ మారిస్తే..ఫేట్ మారుతుందా!
Advertisement
Ads by CJ

వరుస అపజయాలతో సతమతమవుతున్న కథానాయకుడు రామ్ ఎలాగైనా ఓ కమర్షియల్ సక్సెస్ కొట్టాలని ఆరాటపడుతున్నాడు. ఆ మధ్య సినిమాలకు కొంత విరామం తీసుకుని కథల బ్యాంక్‌ను రెడీ చేసుకున్నానని చెప్పి.. ఇటీవల వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నా... ఇప్పటి వరకు రామ్‌కు సరైన విజయం లభించలేదు. అయితే కథలు సొంతంగా సెలెక్ట్ చేసుకున్న సరైన ఫలితం రాకపోవడంతో ఈ సారి ఎలాగైనా విజయాన్ని సాధించాలనే పట్టుదలతో వున్నాడు ఈ యువ కథానాయకుడు. అయితే ప్రస్తుతం రామ్ తాజాగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. అయితే మొదట్లో ఈ చిత్రానికి హరికథ అనే టైటిల్‌ను అనౌన్స్ చేశారు. ఈ టైటిల్‌లో నెగెటివ్ సెన్స్ వుండటంతో సెంటిమెంట్‌గా ఫీలయిన రామ్.. ఆ టైటిల్‌ను ‘నేను-శైలజ’గా మార్చేశాడు. టైటిల్ మారిస్తే..కనీసం ఫ్రెష్‌గా వుంటుందనే భావనతో రామ్ ఇలా చేశాడట. ఈ టైటిల్‌తోనైనా తన ఫేట్  మారుతుందనే ఆశతో వున్నాడు రామ్. అయితే కథలో విషయం వుండాలే కానీ టైటిల్‌తో పనేముంది.. అంటున్నారు సినీజనాలు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ