ఓపెనింగుతోనే అదరగొట్టిన బెంగాల్ టైగర్ వీకెండ్ సినిమా లవర్లకు సూపరు ఆప్షనుగా మారింది. అటు క్రిటిక్స్, ఇటు కామన్ ఆడియెన్సు ఈ మూవీ సూపర్ హిట్టంటూ ఫస్ట్ షోతోనే గుద్దిపడేసారు. అందుకే కలెక్షన్ల కనక వర్షం కురుస్తూనే ఉంది. ఈ వర్షం ఉధృతి ఎంతలా ఉందంటే ఆదివారం అంటే రేపు సాయంత్రానికి బయ్యర్లు పెట్టిన సొమ్ములు గ్యారంటీగా వెనక్కి వచ్చేస్తాయి. ఫస్ట్ డే 6 కోట్లు, సెకండ్ డే 4 కోట్లు, థర్డ్ డే అంటే ఈ రోజు 5 కోట్లు, ఆదివారం అంటే రేపు మరో 5 వేసేస్తే మొత్తంగా నాలుగు రోజుల్లోనే బెంగాల్ టైగర్ 20 కోట్ల క్లబ్బులోకి చేరిపోనుంది. ఇక అక్కడి నుండి వచ్చేవన్నీ లాభాల ఖాతాలోకే వెళ్తాయి అంటున్నాయి వ్యాపార వర్గాలు. తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లోనే కాకుండా కర్నాటక, ఒరిస్సా మరియు ఓవర్సీస్ అంతటా బెంగాల్ టైగర్ సినిమాకు జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. నిర్మాత రాధా మోహన్, హీరో రవితేజ, దర్శకుడు సంపత్ నంది గారు కూడా ఈ రిజల్ట్ పట్ల ఫుల్ హ్యాపీస్.