Advertisementt

మహేష్‌కి మాత్రమే టాప్ ప్లేస్!

Sat 12th Dec 2015 09:27 PM
mahesh babu,forbes magazine,mahesh babu again got top place,mahesh babu forbes magazine list  మహేష్‌కి మాత్రమే టాప్ ప్లేస్!
మహేష్‌కి మాత్రమే టాప్ ప్లేస్!
Advertisement
Ads by CJ

ప్రముఖ ఫోర్బ్స్‌ మేగజైన్‌ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు తదితరుల సంపాదన వివరాలు ప్రతి సంవత్సరం విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా 2015వ సంవత్సరానికి గాను సంపాదన విషయంలో ఇండియన్‌ టాప్‌ 100లిస్ట్‌లో చోటు దక్కించుకున్న ప్రముఖుల వివరాలు విడుదల చేసింది. ఈ టాప్‌ 100లిస్ట్‌లో ఈసారి ఎక్కువ మంది టాలీవుడ్‌ సెలబ్రిటీలు చోటు దక్కించుకున్నారు. సంపాదన విషయంలో టాలీవుడ్‌లో మహేష్‌ అందరికంటే ముందు ఉన్నాడు. ఆయన ఇండియన్‌ టాప్‌ 100 లిస్ట్‌లో ఓవరాల్‌గా 32వ స్ధానంలో నిలిచాడు. ఫేమ్‌ ర్యాంకు 78 ఉండగా, మనీ ర్యాంకు 13గా ఉంది. ఇక అల్లుఅర్జున్‌ ఓవరాల్‌గా 42వ స్ధానం దక్కించుకున్నాడు. టాప్‌ 50లో ఈ ఇద్దరు తెలుగు స్టార్లకు మాత్రమే చోటు దక్కింది. టాప్‌ 100లిస్ట్‌లో ప్రభాస్‌, రాజమౌళి, కాజల్‌, శృతిహాసన్‌, రవితేజ, పూరీజగన్నాథ్‌ తదితరులు ఉన్నారు .కాగా మెదటి స్థానంలో షారుక్‌ఖాన్‌ ఉండగా, 2వ స్థానంలో సల్మాన్‌ఖాన్‌ ఉన్నాడు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ