నందమూరి బాలకృష్ణ హీరోగా ఈరోస్ ఇంటర్నేషనల్ పతాకంపై శ్రీవాస్ డైరెక్షన్‌లో బాలయ్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'డిక్టేటర్'. కాగా ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మొన్నటి చెన్నై వరదల్లో సిటీతో పాటు తమన్‌కి కూడా చాలా నష్టం కలిగింది. తన స్టూడియో మొత్తం పాడైపోయింది. కానీ 'డిక్టేటర్'ను మాత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలకు సిద్దం చేస్తున్నారు. దీంతో 'డిక్టేటర్' రిరికార్డింగ్ ఆగిపోయింది. అందువల్ల తాను ఈ చిత్రాన్ని త్వరగా పూర్తిచేయలేనని తమన్ దర్శకుడు శ్రీవాస్‌కు తెలపడంతో ఆయన రీరికార్డింగ్ కోసం అందులో నిష్ణాతుదైన మణిశర్మను ఆ పని చేయమని ఒప్పించాడట. దీంతో తమన్ స్థానంలో మణిశర్మను రిరికార్డింగ్ కోసం రీప్లేస్ చేసే ఉద్దేశ్యంలో యూనిట్ ఉంది.