Advertisementt

నిజంగా బాలయ్య పిలిచాడా?

Sat 12th Dec 2015 01:45 PM
nayanathara,dictator,balakrishna  నిజంగా బాలయ్య పిలిచాడా?
నిజంగా బాలయ్య పిలిచాడా?
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ గారు తనతో నటించే హీరోయిన్లకు కూడా మంచి మర్యాదనిచ్చే వ్యక్తి. అందుకే ఆయన సరసన నటించిన చానా హీరోయిన్లు మరోసారి ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతుంటారు. బయటకు సింహంలా గంభీరంగా కనపడే బాలయ్య మనసు సున్నితమైనదని, అతను బాగా డౌన్ టు ఎర్త్ అన్న వాఖ్యాలు ఆయనతో నటించిన ఎందఱో స్టార్ నటీమణుల నోటి వెంట విన్నదే. అలాగే బాలకృష్ణ కూడా ఎవరినైనా నచ్చేసాడంటే వాళ్లకు పిలిచి మరి మళ్ళీ మళ్ళీ అవకాశాలు పంచేస్తుంటారు. ప్రస్తుతం సోనాల్ చౌహన్ ఇందుకు మంచి ఉదాహరణ. లెజెండ్ తరువాత డిక్టేటర్ సినిమాలో బాలయ్యతో ఆడిపాడుతోంది. విశేషం ఏమిటంటే సింహా, శ్రీ రామరాజ్యంలో నటసింహానికి చూడ ముచ్చటైన జంటగా అగుపించిన నయనతారను ఓ ప్రత్యేక పాత్ర కోసం డిక్టేటర్ చిత్రానికి పని చేయమని అడిగారని, అందుకు తమిళంలో బాగా బిజీగా ఉన్నా బాలయ్య మాటను కాదనలేక నయనతార రెండు రోజులు డిక్టేటర్ షూటింగ్ కోసం సమయం కేటాయించిందని టాక్. ప్రస్తుతానికి వెంకటేష్ బాబుతో బాబు బంగారం సినిమా నయనతార చేస్తుందన్న విషయం మనకు తెలిసిందే. ఈసారి అతిథి పాత్రలో బాలకృష్ణ పక్కన ఎంతలా తళుక్కుమని మెరుస్తుందో చూద్దాం.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ