'బాహుబలి' తర్వాత ప్రభాస్ రేంజ్ ఆకాశాన్ని తాకుతోంది. కాగా ఇప్పుడు ఆయన 'బాహుబలి2' పై దృష్టి పెట్టాడు. ఈ సెకండ్ పార్ట్ కూడా విడుదలైందంటే ఇక ప్రభాస్‌ను ఆపడం ఎవ్వరికి సాద్యం కాదు. ఆయన కోసం ఇప్పటికే పలు భారీ నిర్మాణ సంస్థలు పోటీపడుతున్నాయి. కానీ వాటన్నింటినీ కాదని తన స్నేహితులు స్థాపించిన 'యువి క్రియేషన్స్' కే అవకాశాలు ఇస్తానంటూ ప్రభాస్ తన గొప్పతనాన్ని చాటుకుంటున్నాడు. ఎప్పుడు 'బాహుబలి2' విడుదల అవుతుందో తెలియదు కానీ, ఆ సినిమా తర్వాత సుజీత్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నట్లు ఇప్పటికే ప్రభాస్ హామీ ఇచ్చేశాడు. దీంతో 'రన్ రాజా రన్' తర్వాత దాదాపు ఒకటిన్నరేళ్లుగా ప్రభాస్‌తోనే సినిమా చేయాలని కృతనిశ్చయంతో ఉన్న సుజీత్ ప్రభాస్ కోసం ఎదురుచూపులు చూస్తున్నాడు. ఇక తాజాగా ఆయన 'జిల్' దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. ఈ రెండు చిత్రాలను ఆయన యువి క్రియేషన్స్ బేనర్‌లోనే చేయనున్నాడని సమాచారం. మొత్తానికి నెరవేర్చేది ఎప్పుడో తెలియదు కానీ తాను మాత్రం తన స్నేహితులకు వరాలిచేస్తున్నాడు ప్రభాస్.