'ఇష్క్, మనం' చిత్రాలతో దర్శకుడు విక్రమ్ కె.కుమార్ దశ తిరిగిపోయింది. ముఖ్యంగా 'మనం' చిత్రం ఘనవిజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా లభించడం, ఆయన టేకింగ్, స్క్రీన్‌ప్లే వంటివి మన స్టార్ హీరోలను బాగా ఆకట్టుకున్నాయి. అదే ఊపులో ఆయన తమిళంలో కూడా తన సత్తా చాటేందుకు సూర్య హీరోగా '24' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుగుతోంది. కాగా ఈ చిత్రం తర్వాత ఆయన మారలా టాలీవుడ్ స్టార్స్‌పై దృష్టి కేంద్రీకరించాడు. ఇటీవలే ఆయన మహేష్‌బాబుకు, అల్లుఅర్జున్‌లకు స్టోరీలు చెప్పి గ్రీన్‌సిగ్నల్ అందుకున్నాడు. ఈ విషయాన్ని విక్రమ్ సైతం అఫీషియల్‌గా తెలియజేసి తన తదుపరి చిత్రాలపై క్లారిటీ ఇచ్చాడు. కాగా ఈ ఇద్దరిలో ఆయన మొదటగా బన్నీతో సినిమా తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహేష్ ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'బ్రహ్మూెత్సవం' చేస్తున్నాడు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే మురుగదాస్ చిత్రం ప్రారంభం కానుంది. ఇక బన్నీ విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం బోయపాటిశ్రీను దర్శకత్వంలో 'సరైనోడు' చిత్రం చేస్తున్నాడు. ఆ తర్వాతి సినిమా ఏమిటి? అనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు.కానీ బన్నీ 'సరైనోడు' తర్వాత విక్రమ్ కె.కుమార్‌తోనే సినిమా చేస్తున్నాడన్నది స్పష్టమైన సమాచారం. సో.. మొదట బన్నీతో చిత్రం చేసి ఆ తర్వాత మహేష్‌పై దృష్టి పెట్టనున్నాడు ఈ క్రేజీ డైరెక్టర్.