గురువారం విడుదలైన మాస్‌మహారాజా రవితేజ నటించిన 'బెంగాల్‌టైగర్' చిత్రం మొదటి షో నుండే హిట్ టాక్ తెచ్చుకొంది. 'కిక్2' వంటి డిజాస్టర్‌ను మరిచిపోయేలా ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సగటు ప్రేక్షకులు రవితేజ సినిమా నుండి ఏమేమి ఆశిస్తారో అలాంటి అంశాలన్ని ఈ చిత్రంతో ఉండటంతో ఈ చిత్రం రవితేజ కెరీర్‌లోనే పెద్ద విజయాన్ని నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ చిత్రం చూస్తే రవితేజ ఎనర్జీ, సంపత్‌నంది కసి, నిర్మాత రాధామోహన్ రాజీ పడని నిర్మాణం, భీమ్స్ అందించిన సంగీతం ఇలా... అన్ని బాగా సమకూరాయని చెప్పవచ్చు. కాగా ఈ చిత్ర విజయంలో తమన్నా, రాశిఖన్నాల గ్లామర్‌షో, పృథ్వీ కామెడీ.. ఇలా అన్ని హైలైట్‌గా చెప్పుకోవచ్చు. కాగా ఈ చిత్రం శాటిలైట్ రైట్స్‌ను జెమినీచానల్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇందుకోసం 7.5కోట్లను జెమినీయాజమాన్యం కేటాయించింది. రవితేజ కెరీర్‌లోనే శాటిలైట్ రైట్స్ ఇంత బారీ రేటు రావడం ఇదే తొలిసారి. మరోపక్క ఈ చిత్రం థియేటర్ కలెక్షన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయని ట్రేడ్‌వర్గాలు చెబుతున్నాయి. సో.. ఇబ్బందుల్లో ఉన్న రవితేజ కెరీర్‌కు ఈ చిత్రం మరో రెండు మూడేళ్లు ఢోకా లేకుండా చేసిందని చెప్పవచ్చు.