చెన్నైలోని పరిస్థితులు ఇప్పుడిప్పుడే మెరుగవుతున్నాయి. గత రెండు మూడు రోజులుగా విద్యుత్ సప్లై కూడా మెరుగుపడింది. కానీ కమల్‌హాసన్ ఆఫీస్‌కు మాత్రం గత వారం రోజులుగా పవర్ సప్లై లేదు. రాష్ట్ర ప్రభుత్వంపై కాంట్రవర్శీ స్టేట్‌మెంట్ ఇచ్చిన తర్వాత జరిగిన పరిణామంగా దీనిని కోలీవుడ్ భావిస్తోంది. ఇప్పుడు కోలీవుడ్ అంతటా ఇదే చర్చ నడుస్తోంది. ఇక కమల్, తమిళనాడు ఆర్ధికమంత్రి పన్నీర్‌సెల్వం మాటల యుద్దం కాస్త కొత్త టర్న్ తీసుకొంది. తను కట్టిన పన్ను సొమ్ము ఏమైందని తాను ప్రశ్నించలేదని, వరద దుస్థితి పై అసలు ప్రభుత్వాన్ని తాను విమర్శించనే లేదని కమల్ వివరణ ఇచ్చాడు. ఈమేరకు ఆయన ఒక పత్రికాప్రకటన విడుదల చేశాడు. ఆ ప్రకటనలో ఉత్తరాదిలోని ఓ పాత్రికేయ మిత్రుడికి రాసిన ఆంగ్ల లేఖలో తన మాటలను వక్రీకరించారని, అతేగాక ఇది పన్నీర్‌సెల్వం విమర్శలకు బదులు కాదని, సహాయక చర్యల్లో పాల్గొంటున్న సహృదయులు గందరగోళానికి గురికాకూడదనే ఉద్దేశ్యంతోనే ఈ ప్రకటన విడుదల చేసినట్లు కమల్ పేర్కొంటున్నాడు. గతంలో కూడా ఆయన 'విశ్వరూపం' చిత్రానికి జయ ప్రభుత్వం పలు వేధింపులకు గురి చేసిన విషయం గుర్తుండే ఉంటుంది.