Advertisementt

'నాన్నకు ప్రేమతో' ఇబ్బందులు..!

Thu 10th Dec 2015 03:40 PM
ntr,nannaku prematho,sukumar,dictator,balakrishna  'నాన్నకు ప్రేమతో' ఇబ్బందులు..!
'నాన్నకు ప్రేమతో' ఇబ్బందులు..!
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్‌, సుకుమార్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'నాన్నకు ప్రేమతో'. సంక్రాంతి కానుకగా విడుదలకు ప్లాన్‌ చేసిన ఈ చిత్రం అదే ఊపులో బిజినెస్‌ కూడా మొదలుపెట్టింది. అయితే ట్రేడ్‌వర్గాల్లో చెబుతున్న దాన్ని బట్టి ఈ చిత్రానికి ఎ.పి. నుండి డిస్ట్రిబ్యూటర్లు ఉత్సాహంగా సినిమా తీసుకునేందుకు ముందుకురావడం లేదట. బాలకృష్ణ నటిస్తున్న 'డిక్టేటర్‌' చిత్రంపైన ఈ సినిమాను వేయడం దానికి ప్రదాన కారణంగా చెబుతున్నారు. ఇక ఎపిలో టిడిపి శ్రేణులు, నందమూరి అభిమానులు బాలయ్య వెనకే ఉండి ఎన్టీఆర్‌ను పట్టించుకోకపోవడం కూడా ఈ సినిమాకు ఇక్కడ భారీగా బిజినెస్‌ జరగకపోవడానికి మరో కారణం అంటున్నారు. ఇక వరుసగా పెద్ద హీరోల చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా దెబ్బతినడం చూసి భారీ ఆఫర్‌ను ఎవ్వరూ ఆఫర్‌ చేయడం లేదని తెలుస్తోంది. దాంతో నిర్మాతలు చెప్పిన రేటుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు అంటున్నారు. ఈ చిత్రం నైజాం రైట్స్‌ను రిలయెన్స్‌వారు తీసుకున్నారు. వారే ఈ చిత్రానికి ఫైనాన్స్‌ కూడా చేస్తున్నారు. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ కోసం సుకుమార్‌ బాగా రాజీ పడ్డాడని సమాచారం. సుకుమార్‌ సినిమా అంటే దానిలో ఓ మంచి ఐటం సాంగ్‌ కంపల్సరీ. కానీ కథకు అడ్డం తగులుతుందనే ఉద్దేశ్యంతో ఈ చిత్రంలో సుకుమార్‌ ఐటం సాంగ్‌ జోలికి పోలేదని అంటున్నారు. అంతేకాదు.. టైటిల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందనిపించేలా ఉన్నప్పటికీ ఈ చిత్రంతో సుకుమార్‌ ఏ ప్రయోగం చేయడం లేదని, పక్కా యాక్షన్‌ అండ్‌ మాస్‌ చిత్రాన్ని తీస్తున్నాడని అంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ