Advertisementt

‘అఖిల్’ అల్లు అర్జున్‌ను ఫాలో అవ్వాలి!

Thu 10th Dec 2015 01:37 PM
akhil,allu arjun,aarya,sukumar,akhil movie,akhil akkineni  ‘అఖిల్’ అల్లు అర్జున్‌ను ఫాలో అవ్వాలి!
‘అఖిల్’ అల్లు అర్జున్‌ను ఫాలో అవ్వాలి!
Advertisement
Ads by CJ

2015 సంవత్సరం విడుదలైన చిత్రాల్లో డిజాస్టర్‌ల్లో  ‘అఖిల్’ నెంబర్‌వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఏడు కోట్ల శాటిలైట్ హక్కులు 70 లక్షలకు అమ్ముకోవాల్సి వచ్చిందంటే ఈ చిత్రం ఎలాంటి పరాజయాన్ని చవిచూసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే అఖిల్ తొందరపాటు అటిట్యూటే.. తొలి సినిమా ఎంపికలో పొరపాటు చేసేలా చేసి.. ఏ వారసుడు తొలిచిత్రానికి అందుకోని ఘోరమైన అనుభవాన్ని అఖిల్ అనుభవించాడు.. సో.. ఇకనైనా అఖిల్ మాస్..మసాలా.. అంటూ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ల జోలికి వెళ్లకుండా.. క్యూట్‌లవ్‌స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తే బాగుంటుందని అంటున్నారు ఆయన అభిమానులు. గంగోత్రి తర్వాత అల్లు అర్జున్ నటించిన ‘ఆర్య’ చిత్రం ప్రేమకథా చిత్రాల్లో ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆచిత్రమే అల్లు అర్జున్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ‘ఆర్య’ చిత్రంతో దర్శకుడు సుకుమార్, బన్నీని పూర్తి స్టయిలిష్ హీరోగా మార్చిన సంగతి తెలిసిందే. సో.. ఇప్పుడు అఖిల్ అల్లు అర్జున్ బాటలోనే తన రెండో చిత్రంగా సుకుమార్ లాంటి క్రియేటివ్ దర్శకుడి నిర్ధేశకత్వంలో ఓ వైవిధ్యమైన ప్రేమకథా చిత్రంతో ముందుకు వస్తే విజయం తథ్యమని అంటున్నారు అఖిల్ శ్రేయోభిలాషులు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ