ఏడాది కిందటి వరకు వారు స్టార్‌డైరెక్టర్లు. వారితో సినిమాలు చేయడానికి స్టార్‌హీరోలు క్యూ కట్టేవారు. కానీ వారు తాజాగా తీసిన ఒకటి రెండు చిత్రాలు డిజాస్టర్స్ కావడంతో వారు ఇప్పుడు గోళ్లు గిల్లుకుంటున్నారు. తమ తదుపరి చిత్రాలను ఏ జోనర్‌లో, ఏ హీరోతో చేయాలనే విషయమై మల్లగుల్లాలు పడుతున్నారు. 'అఖిల్' చిత్రం తర్వాత వినాయక్ పరిస్థితి దారుణంగా మారింది. చిరు 150వ చిత్రం విషయంలో నిన్నామొన్నటివరకు ఆయన పేరు అన్నిచోట్లా వినిపించింది. కానీ ఇప్పుడు ఆ ఊసే లేదు. తనంతట తాను కావాలని రెండు నెలలు గ్యాప్ తీసుకొంటున్నాడు. ఈ టైమ్‌లో ఆయన ఎలాంటి చిత్రాలు భవిష్యత్తులో చేయాలి? అనే విషయంలో మేదోమధనం చేయనున్నాడు. ఫిబ్రవరి తర్వాతే ఆయన చేయబోయేచిత్రంపై క్లారిటీ వస్తుంది. ఇక 'ఆగడు, బ్రూస్‌లీ' పరాజయాల తర్వాత శ్రీనువైట్ల పరిస్థితి దారుణంగా మారింది. ఆయన తదుపరి చిత్రంపై ఉత్కంఠ నెలకొని ఉంది. ఆయనతో చేయడానికి ఏ హీరో కూడా ముందుకు రావడం లేదు. దాంతో ఆయన రామ్, రానా వంటి వారితో మరలా తన సత్తా నిరూపించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక 'సుబ్రమణ్యం ఫర్ సేల్' బాగానే ఆడినప్పటికీ హరీష్‌శంకర్ తదుపరి చిత్రంపై క్లారిటీ లేదు. తన స్నేహితులతో ఓ బేనర్ స్థాపించి అందులో సినిమాలు చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నాడు. ఇక 'గోవిందుడు అందరివాడేలే' తర్వాత కృష్ణవంశీది కూడా అదే పరిస్థితి. మరి వీరు తమ తదుపరి చిత్రాల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచిచూడాల్సివుంది..!