'రఘువరన్ బిటెక్' హిట్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ధనుష్ తాజా చిత్రం డిసెంబర్ 18న విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌కు 'నవ మన్మధుడు' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ధనుష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అయిన చిత్రం 'విఐపి'. ఈ చిత్రం తమిళ, తెలుగుభాషల్లో మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి వేల్‌రాజ్ డైరెక్టర్ కాగా అనిరుధ్ సంగీతం అందించాడు. ఇదే కాంబినేషన్ మరోసారి రిపీట్ అయింది. తాజాగా రూపొందిన ఈ చిత్రాన్ని ధనుష్ తన స్వీయనిర్మాణంలో నిర్మిస్తున్నాడు. 'తంగామగన్'గా ఈ చిత్రానికి తమిళంలో టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో సమంత, అమీజాక్సన్‌లు హీరోయిన్లుగా ధనుష్ సరసన నటిస్తున్నారు. మొత్తానికి నాగార్జున కెరీర్‌లోనే పెద్ద హిట్ అయిన 'మన్మథుడు' టైటిల్‌ను 'నవ మన్మధుడు'గా మార్చి విడుదల చేస్తున్న ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో వేచిచూడాల్సి ఉంది.