Advertisementt

వరుణ్ సందేశ్ నిశ్చితార్థం, ఎక్కడా కవరేజి?

Wed 09th Dec 2015 05:45 PM
varun sandesh vithika sheru engagement photos  వరుణ్ సందేశ్ నిశ్చితార్థం, ఎక్కడా కవరేజి?
వరుణ్ సందేశ్ నిశ్చితార్థం, ఎక్కడా కవరేజి?
Advertisement
Ads by CJ

హ్యాపీ డేస్ కుర్రాడు వరుణ్ సందేశ్ తొందరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తాను మనస్ఫూర్తిగా ప్రేమించిన హీరోయిన్ వితిక షేరుతో నిన్నే హైదరాబాద్‌లో నిశ్చితార్థం జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన కుటుంబ సభ్యుల నడుమ, స్నేహితుల మధ్యా ఈ వేడుక జరిగింది. కొద్దిమంది సన్నిహితులను మాత్రమే కార్యక్రమానికి ఆహ్వానించారనీ, నిరాడంబరంగా ఎటువంటి హంగామా లేకుండా ఈవెంట్ కానిచ్చేసారని తెలుస్తోంది. ఎంత లో ప్రోఫైల్ మెయిన్ టైన్ చేయాలనుకున్నా పట్టుమని ఓ పది ఫోటోలైనా బయటకి వదిలితే వీరిని అభిమానించే వారికి అదో తుత్తి మిగిలెది. ఒక వైపు లోఫర్ ఆడియో వేడుక, మరో వైపు అశ్విని దత్తుగారి కూతురి మ్యారేజ్ రిసెప్షనుకు వచ్చిన కవరేజీలో కొంతపాటి కూడా వరుణ్ సందేశ్, వితికల ప్రోగ్రాముకి రాకపోవడంతో చాలా మంది సామాన్యులకి వీళ్ళు ట్విట్టర్ ద్వారా ఓ ఫోటో పెట్టేవరకు అసలు విషయమే తెలియలేదు. ఈ నెల మొదట్లోనే మా వివాహ నిశ్చితార్థం అని వరుణ్ చెప్పినప్పట్టికీ, వెంటనే వితిక మాత్రం వరుణ్ అనారోగ్యంతో బాధ పడుతున్నాడని చెప్పి కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. అందుకే అసలు నిశ్చితార్థం అనుకున్న సమయానికి ఉందా లేదా అన్న డౌట్ అలాగే ఉండిపోయింది. ఏదైతే ఏంటి, యూ టూ ఆర్ వండర్ ఫుల్ అండ్ నిశ్చితార్థ శుభాకాంక్షలు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ