సాలో సాల్ భీత్ గయే, ఏళ్ళకు ఏళ్ళు గడిచిపోయాయి... చిరంజీవిని మరోసారి సంతృప్తిగా తెర మీద రెండున్నర గంటలు కళ్ళార్పకుండా చూసుకుందామనుకున్న మెగా ఫ్యాన్స్ కోరిక తీరనే తీరలేదు. పాత అప్పులోడికి రేపు రా, మాపు రా అన్ని చెప్పిన్నట్టుగా ఇదిగో నూట యాభయ్యో సినిమా, అదిగో నూట యాభయ్యో సినిమా అనౌన్స్ మెంట్ అంటూ గత కొన్నాళ్ళుగా మెగా ఫ్యాన్సును విపరీతమైన ప్రెజర్లో పెట్టారు. మంత్ బై మంత్ మన ముందు ఎన్నో డెడ్ లైన్లు పెట్టారు. ఇక ఇప్పుడు తాజాగా రాబోయే నూతన సంవత్సరంలో సంక్రాంతి పండగ రోజున చిరంజీవి వన్ అండ్ హాఫ్ సెంచరి గురించి అఫీషియల్ ప్రకటన వెలువడుతుంది అని మీడియాలో కొత్త ప్రచారం కొనసాగుతోంది. బ్రూస్ లీలో చిరు చేసిన క్యామియోకి రావాల్సినంత క్రేజ్ రాకపోవడంతో, 150వ విషయాన్ని ఆషామాషీగా తీసుకోలేము. కథలోనో, కథనంలోనో కొంచెం తేడా కొట్టినా సినిమా మొత్తం తేడా కొట్టేస్తుంది. అందుకే ఆచితూచి అడుగేయమని చిరుకి ఫ్యామిలీ మొత్తం సపోర్టుగా నిలిచిందట. ఫర్ అ చేంజ్, రాబోయే సంక్రాంతికి పెద్ద సినిమాల రిలీజుల మధ్యలో చిరంజీవి 150 సినిమా కాదు కానీ రామ్ చరణ్ కొత్త సినిమా పరంగా ఓ ప్రెస్ నోట్ వెలువడే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మీ గెస్ కరెక్టే, తని ఒరువన్ తెలుగు రీమేక్ పైనే సంక్రాంతికి మెగా అభిమానులకు శుభవార్త.