పూరి జగన్నాథ్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం 'లోఫర్'. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ సోమవారం హైదరాబాద్ లో జరింగింది. ఈ కార్యక్రమానికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అతిథిగా విచ్చేసాడు. అయితే స్టేజీ మీద ప్రభాస్ మాట్లాడానికి మైక్ తీసుకున్నప్పుడు అభిమానులంతా.. ప్రభాస్ ను మాట్లాడనివ్వకుండా పవర్ స్టార్.. పవర్ స్టార్ అని గోల చేస్తూనే ఉన్నారు. ఫైనల్ గా ప్రభాస్ 'ఓకే ఐ లైక్ పవర్ స్టార్.. ఇప్పుడు మాట్లాడొచ్చా.. అని అడిగాడు. అసలు ఆడియో ఫంక్షన్, పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించింది కాదు. పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చర్చించుకున్న సంఘటనలు జరగలేదు. అలాంటప్పుడు ఫ్యాన్స్ అంతా.. పవర్ స్టార్ అని అరవడంలో అర్ధమేముంది..? మెగా ఫ్యామిలీకు సంబంధించిన ప్రతి ఈవెంట్ లో ఇదే తంతు. పవన్ బయట ఫంక్షన్స్ కు రాడని తెలిసి కూడా అభిమానులు అలా గెస్ట్ లను విసిగించడం సబబు కాదు. రీసెంట్ గా భీమవరంలో ప్రభాస్ అభిమానులకు, పవన్ అభిమానులకు మధ్య జరిగిన గొడవ కారణంగా ప్రభాస్ ను మాట్లాడనివ్వకుండా చేసారో.. లేక పవన్ కళ్యాణ్ ఫంక్షన్ కు రావాలని అలా చేసారో.. వారికే తెలియాలి. ఏదైతేనేమి.. డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ తన అభిమానులను పిలిచి చెప్తే తప్ప ఈ పిచ్చి మానదని కొందరు భావిస్తున్నారు.