Advertisementt

సుకుమార్‌ సిఫార్స్‌ చరణ్‌ వద్ద పనిచేయలేదు..!

Tue 08th Dec 2015 04:16 PM
hebah patel,ram charan,sukumar,thani oruvan movie  సుకుమార్‌ సిఫార్స్‌ చరణ్‌ వద్ద పనిచేయలేదు..!
సుకుమార్‌ సిఫార్స్‌ చరణ్‌ వద్ద పనిచేయలేదు..!
Advertisement
Ads by CJ

తాజాగా సుకుమార్‌ నిర్వహణలో వచ్చిన 'కుమారి 21ఎఫ్‌'తో హేబా పటేల్‌ను బిజీ హీరోయిన్‌గా మార్చివేశాడు సుక్కు. కాగా ఆమెను తనకున్న పరిచయాలతో పలువురికి రికమెండ్‌ చేసి ఆమెకు మంచి అవకాశాలు ఇచ్చే బాధ్యతను సుక్కునే తీసుకున్నట్లు సమాచారం. ఇలా ఆమెకు సుక్కు ఓ గాడ్‌ఫాదర్‌ అవతారం ఎత్తాడు. అందులో భాగంగా త్వరలో సెట్స్‌ మీదకు వెళ్లనున్న రామ్‌చరణ్‌-సురేందర్‌రెడ్డిల 'తని ఒరువన్‌' రీమేక్‌లో హీరోయిన్‌ పాత్రకు అన్వేషణ సాగిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం ఆడిషన్స్‌కు హేబా పటేల్‌ను పంపి ఆమెకు హీరోయిన్‌గా అవకాశం ఇవ్వమని చరణ్‌కు రికమండేషన్‌ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆమెకు ఇంకా తనలాంటి స్టార్‌తో నటించడానికి ఎంతో కాలం పడుతుందని, ఏదైనా చిత్రంలో సెకండ్‌ హీరోయిన్‌ అవకాశం అయితే ఇస్తానని చరణ్‌ సమాధానం చెప్పాడట. మొత్తానికి ఆమె ఇంకా స్టార్‌హీరోల సరసన నటించే స్థాయికి చేరలేదని రామ్‌చరణ్‌ ఉద్దేశ్యంగా తెలుస్తోంది. కాగా హేబా పటేల్‌కు తాజాగా నాగచైతన్య సరసన నటించే అవకాశం వచ్చిందని తెలుస్తోంది. నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మలయాళ 'ప్రేమమ్‌' చిత్రం రీమేక్‌ షూటింగ్‌ ఇటీవల వైజాగ్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రానికి 'మజ్ను' అనే టైటిల్‌ను ఖరారుచేసినట్లు సమాచారం. కాగా ఇందులో మెయిన్‌హీరోయిన్‌గా శృతిహాసన్‌ నటిస్తుండగా, రెండోహీరోయిన్‌గా మలయాళంలో తాను పోషించిన పాత్రనే అనుపమ పరమేశ్వరన్‌ పోషిస్తోంది. కాగా ఈ చిత్రంలో మరో హీరోయిన్‌కు చాన్స్‌ ఉన్న విషయం తెలిసిందే. కాగా ఆ మూడో హీరోయిన్‌గా హేబా పటేల్‌ను తీసుకునే అవకాశాలు పుష్కళంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి హేబా పటేల్‌ రాబోయే కాలంలో కాబోయే స్టార్‌ హీరోయిన్‌ కానుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ