భారత దేశంలో పర్యటిస్తున్న దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు వన్ డే సిరీస్, T 20 సిరీస్ ఎగరేసుకు పోయినప్పుడు క్రికెట్ తెలిసినోల్లు అందరూ బాధపడ్డారు. ఇక టెస్ట్ సిరీస్ దగ్గరికి వచ్చేసరికి విరాట్ కోహ్లి నేతృత్వంలో ఇది కూడా గోవిందా అనుకున్నాం. అనూహ్యమైన స్పిన్ పిచ్చులు ఎదురు కావడంతో దక్షిణాఫ్రికన్ల ఆటలు మన ముందు సాగలేదు. నాలుగు మ్యాచుల సిరీస్ కాస్తా 3-0తో భారత్ వశమైంది. పర్యాటక జట్టు అసలేమాత్రం అంచనా వేయలేని పిచ్చులు తయారు చేసి వన్ సైడ్ గేమ్ ఆడారని కొందరు ఈ ఫలితాన్ని వక్రీకరించినా ఇరు జట్లు ఇదే పిచ్ పైన ఆదాయాని గుర్తుంచుకుంటే మంచిది. ఈ రోజు ఢిల్లీలో తేలిన ఆఖరి టెస్టు విజయంతో భారత జట్టు మరోసారి టెస్టుల్లో తమది అత్యుత్తమ ప్రదర్శన అని చాటి చెప్పింది. సిరీస్ గెలిచిన సంతోషంలో కూడా కెప్టెన్ విరాట్ కోహ్లి అన్న మాటలు అతడు అందరి మనసులు గెలిచేలా చేసాయి. ఈ టెస్ట్ సిరీస్ విజయాన్ని చెన్నై వరదలతో పోరాడుతున్న అక్కడి క్షతగాత్రులకు అంకితం చేస్తున్నాం, మేం వారికి అండగా ఉన్నాం అని కోహ్లీ అనగానే ఢిల్లీ స్టేడియం హర్శద్వానాలతో దద్దరిల్లింది.