Advertisementt

వరస పెట్టి వాయిస్తున్నాడుగా!

Tue 08th Dec 2015 01:55 PM
prudhvi,30 years industry,bengal tiger  వరస పెట్టి వాయిస్తున్నాడుగా!
వరస పెట్టి వాయిస్తున్నాడుగా!
Advertisement
Ads by CJ

నచ్చిన పనిని సహనంతో ఎన్నేళ్ళైనా చేసుకుంటూ పోతే ఆటోమేటిగ్గా గుర్తింపు దానంతట అదే వస్తుంది అని చెబుతోంది థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ గారి కెరీర్. అదృష్టం, దురదృష్టం అనేవి ఎప్పుడూ మన చుట్టే ఉన్నా కష్టానికి తగ్గ ఫలితం మాత్రం దొరక్కపోదు. ఖడ్గం సినిమాలో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అనే  ఒక్క మ్యానరిజంతో అందరికీ దగ్గరైన పృథ్వీ మొన్నటి లౌక్యంలో బాలకృష్ణ లెజెండ్ స్పూఫ్ తరువాత నిజంగా స్టార్ కమెడియన్ అయిపోయారు. ఒకప్పుడు బ్రహ్మానందం గారు ప్రతి వారం విడుదలయ్యే ఏదో ఒక సినిమాలో మనలను నవ్వించే పాత్రలో కనపడినట్లుగా ఇప్పుడు పృథ్వీ కూడా వరస పెట్టి వాయించేస్తున్నాడు. మొన్నటి వారంలో పర్సెంటేజ్ పరమేశ్వర్ అంటూ శంకరాభరణంలో చక్కిలిగింతలు పెట్టిన పృథ్వీ ఈ వారం బెంగాల్ టైగర్లో ఫ్యూచర్ స్టార్ సిద్దప్ప ద్వారా మరిన్ని నవ్వులు పంచడానికి రాబోతున్నాడు. ఇదే క్రేజుని కంటిన్యూ చేస్తే పృథ్వీని క్యాష్ చేసుకోవడానికి ప్రతి సినిమాలో మనాడికో క్యారెక్టర్ రాస్తూ రచయితలు కూడా ప్రోత్సాహం అందిస్తారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ