Advertisementt

పవన్ కోసం త్రివిక్రమ్ సంప్రదించాడు!

Mon 07th Dec 2015 10:24 PM
pawan kalyan,trivikram srinivas,mythri movie makers  పవన్ కోసం త్రివిక్రమ్ సంప్రదించాడు!
పవన్ కోసం త్రివిక్రమ్ సంప్రదించాడు!
Advertisement
Ads by CJ

అత్తారింటికి దారేది చిత్రాన్ని టాలివుడ్ చరిత్రలో ఓ మేలిమి సూపర్ హిట్ కింద నిలిపిన కీర్తి పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ గార్లకే చెల్లాలి. వీరిద్దరి కలిసి సినిమా చేస్తామంటే వద్దనే నిర్మాతలు ఎవరైనా ఉంటారా. ఇదిగో ఇలాంటి ఓ హ్యాపీ న్యూస్ ఇప్పుడు ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతూ పవర్ స్టార్ అభిమానులని ఆనంద డోలికల్లో ఊపుతోంది. జల్సా, అత్తారింటికి దారేది తరువాత మరో భారీ కమర్షియల్ సినిమా వీళ్ళ  కాంబినేషన్లో రాబోతున్నట్లు సమాచారం. నిర్మాతలు ఎవరో కాదు, మహేష్ బాబు శ్రీమంతుడుతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు యెర్నేని నవీన్, రవిశంకర్ అండ్  మోహన్ గార్లు. ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీయార్ జనతా గ్యారేజీతో బిజీగా ఉన్న ఈ నిర్మాతలతో పవన్ కళ్యాణ్ గారిని హీరోగా పెట్టి తీసే ఓ కథను త్రివిక్రమ్ వినిపించారట. అన్నీ కుదిరాయి కాబట్టి వచ్చే ఏడాది చివరలో ముహూర్తం పెట్టుకుందామని రెండు పార్టీలు అనుకున్నట్లు సమాచారం. నిర్మాతలతో సంప్రదింపులు జరిపిన విషయాన్ని స్వయానా త్రివిక్రమ్ గారే పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి చెప్పారని టాక్. మరో సెన్సేషనల్ మూవీకి మనం 2017లో తయారవచ్చు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ