Advertisementt

మా కలయిక అనైతికం: కోన

Mon 07th Dec 2015 10:18 PM
kona venkat,srinu vytla,bruce lee  మా కలయిక అనైతికం: కోన
మా కలయిక అనైతికం: కోన
Advertisement
Ads by CJ

శ్రీను వైట్ల, కోన వెంకట్... ఇది అపూర్వమైన కలయిక అని మనకు తెలుసు. ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్లో తెలుగు సినిమా హాస్యం కొత్త పుంతలు తొక్కి స్టార్ హీరోల పవర్ తగ్గి కమెడియన్ల సత్తా చాటి చెప్పిన ఘనత వీరిది. మరి అటువంటి కోన, శ్రీను విడిపోయారంటే బాధ పడని సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడు లేడు. అయినా ఈగోలు సర్వ సాధారణమే కదా అనిపించేలా చిరంజీవి, రామ్ చరణ్ చలవ వల్ల బ్రూస్ లీకి దగ్గరయి అందరికీ ఆనందం పంచారు. ఈ సినిమా బోల్తా కొట్టిననాటి నుండి మళ్ళీ పాత పాటే అందుకున్నారు ఇరువురు. ఈసారి కోన గారైతే ఏకంగా మాది అనైతిక కలయిక అని స్టేట్మెంట్ పాస్ చేసారు.

ప్రతి వస్తువుకు ఓ ఎక్స్ పైరీ తారీఖు ఉన్నట్టే మాకు కూడా ఉంది. పది సంవత్సరాలు కలిసి ఉన్నాం. ఇప్పుడు విడిపోయాం. చిరంజీవిగారి కోసం మళ్ళీ చేతులు కలిపినా, మాది అనైతిక కలయిక అని యిట్టె తెలిసిపోయింది అని స్వయానా కోన వెంకట్ గారే చెప్పాక ఇక మాట్లాడడానికి ఏముంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ