Advertisementt

'ప్రేమిస్తే' సంధ్య‌కి పెళ్ల‌య్యింది!

Mon 07th Dec 2015 05:41 PM
premisthee,sandhya,premisthee sandhya marriage,sandhya weds venkat chandrasekharan,annavaram pawan kalyan sister  'ప్రేమిస్తే' సంధ్య‌కి పెళ్ల‌య్యింది!
'ప్రేమిస్తే' సంధ్య‌కి పెళ్ల‌య్యింది!
Advertisement
Ads by CJ

'ప్రేమిస్తే' సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన క‌థానాయిక సంధ్య‌. ఆ సినిమాలో భ‌ర‌త్‌తో క‌లిసి చ‌క్క‌టి అభిన‌యాన్ని ప్ర‌ద‌ర్శించింది. దీంతో అటు తెలుగులోనూ, ఇటు త‌మిళంలోనూ మంచి గుర్తింపొచ్చింది. క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్‌గా రాణించాల‌నుకొంది కానీ ఆ ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. తెలుగులో నేరుగా ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి చెల్లెలిగా అన్న‌వ‌రం సినిమాలో న‌టించింది. అందులో హోమ్లీ లుక్స్‌తో మ‌నింట్లో అమ్మాయిల్ని గుర్తుకు తెప్పించింది. ఆ త‌ర్వాత  మ‌రికొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించింది కానీ... చెప్పుకోద‌గ్గ స్థాయిలో ఆమెకి అవ‌కాశాలు ల‌భించ‌లేదు. అయితే ఇటీవ‌ల ఆమె ఐటీ ప్రొఫెషనల్ వెంకట్ చంద్రశేఖరన్‌ని వివాహం చేసుకుంది. ఆ ఇద్ద‌రి పెళ్లి చెన్నయ్ లోనే సినీ ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌ర‌పాల‌ని ప్లాన్ చేశారు. కానీ భారీ వర్షాలు వీరి పెళ్లి వేడుక‌కి అడ్డుగా నిలిచాయి. ఎలాగైనా ముహూర్తానికి పెళ్లి జ‌ర‌గాల్సిందేన‌ని  ఇరు కుటుంబాలు కేర‌ళ‌లోని గురువాయూర్ టెంపుల్‌కి వెళ్లి అక్క‌డ వేడుక‌ని జ‌రిపారు.  కొద్దిమంది మిత్రులు, బంధువుల స‌మ‌క్షంలో సంధ్య పెళ్లి వేడుక‌ని జ‌రిపారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ