తమిళ, తెలుగు భాషల్లో స్టార్ హీరోయినుగా పేరు పొందిన అమలా పాల్ మొన్న దర్శకుడు విజయ్ గారిని వివాహం చేసుకుందన్న విషయం మనకు తెలిసిందే. అటు తరువాత అమ్మడు పెద్దగా సినిమాలు ఏమీ చేయకుండా భర్త ఇంట గృహిణిగా మారిపోయింది. సినిమాల మీదున్న తృష్ణ కొద్దీ నిర్మాతగా మారి ఓ ప్రాజెక్టు కూడా టేకప్ చేసింది. ఈ సోదంతా ఎందుకుగాని ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అమలా పాల్ ఈ హీరోయిన్ అమలా పాల్ కాదు, కమెడియన్ బ్రహ్మానందం. సంపత్ నంది దర్శకత్వంలో రవితేజ హీరోగా రానున్న బెంగాల్ టైగర్ చిత్రంలో బ్రహ్మి పోషించిన పాత్ర పేరు అమలా పాల్. విభిన్న పాత్రల్లో చిత్ర విచిత్రమైన పేర్లతో మనలను నవ్వించడానికి బ్రహ్మి పడే పాట్లు తెలియనిది కాదు. కానీ బ్రూస్ లీ, అఖిల్ దెబ్బలతో మార్కెట్టులో విపరీతమైన లో లెవెల్లోకి చేరిన బ్రహ్మానందం క్రేజ్ మరోసారి అమలా పాల్ పాత్రతో కడుపుబ్బా నవ్వించి తన పాత వైభవాన్ని తేనుందని అంటున్నారు సినిమా యూనిట్ సభ్యులు. ఆరోగ్యకరమైన హాస్యానికి ఎప్పుడు తెలుగు ప్రేక్షకులు పెద్ద పీట వేస్తారు కనక పోసాని, పృథ్వి, బ్రహ్మి లాంటి బడా పేర్లన్నీ కలిసాయి, సో బెంగాల్ టైగర్ మనకు పండగే పండగ.