వరసగా మూడు విజయాలతో ఊపు మీదున్న హీరో నిఖిల్, ఇప్పుడు శంకరాభరణం డివైడెడ్ టాక్ ఫలితంతో కాస్తంత ఆలోచనలో పడ్డాడు. నిజానికి ఈ సినిమాలోని NRI పాత్రకి నిఖిల్ సెట్ అవలేదు అన్న క్రిటిసిజం కూడా ఎక్కువైంది. తన వైపు నుండి ఎటువంటి తప్పిదాలు ఉండకుండా, గట్టి హోం వర్క్ చేసాడు నిఖిల్. కేవలం ఈ మూవీ కోసమే అమెరికాలో రెండు మూడు నెలలు గడిపి, అక్కడి తెలుగు NRIల బాడీ లాంగ్వేజు, యాస నేర్చుకొచ్చుకున్నాడు. క్యారెక్టరులో పస లేకపోవడం వల్ల అంతా తెచ్చి పెట్టుకున్నట్టుగానే కనపడింది తప్ప ఔచిత్యం ఎక్కడా కనపడలేదు. ఏదేమైనా శంకరాభరణంకి మొదటి రోజు కనీసం మంచి ఓపెనింగ్స్ వచ్చాయంటే అది నిఖిల్ వల్లే అంటున్నారు మార్కెట్ జనాలు. కోనకు క్రేజ్ తగ్గిపోవడం, నందితకు అసలు క్రేజే లేకపోవడం వల్ల నిఖిల్ భుజస్కందాల మీదే శంకరాభరణం నిలబడింది. రెండో వారం సంగతి దేవుడికి తెలుసుగానీ మొదటి వారం ఏ మాత్రం సినిమాకు గిట్టుబాటు అయినా అది నిఖిల్ చలవేనని చెప్పుకోవచ్చు. స్వామి రారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య అంత గొప్ప సినిమా కాకపోయినా నిఖిల్ మీద నమ్మకమున్న జనాలు శంకరాభరణంలో ఉన్న కాసింత కామెడీతో ఊరట చెందొచ్చు.
ఈ సినిమాలతో అతడు బ్యాంకబుల్ హీరో అన్న పేరొచ్చింది. నిఖిల్ తో సినిమా చేస్తే మినిమం గ్యారెంటీ ఉందన్న ఐడెంటిటీ వచ్చింది. అదే ఐడెంటిటీ అతడు నటించిన శంకరాభరణం ఓపెనింగ్స్ కి పెద్ద ప్లస్ అయ్యిందని చెబుతున్నాడు నిఖిల్. ఈ సినిమాని ఏకంగా 600 థియేటర్లలో రిలీజ్ చేశాం. ఇంత భారీగా రిలీజ్ చేస్తున్నందుకు థియేటర్లలో జనాలు కనిపిస్తారా అని ఆరంభం భయపడ్డాం. కానీ తొలిరోజు ఓపెనింగులు అదిరిపోయాయ్ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే శంకరాభరణం చిత్రానికి ఆరంభమే ఫ్లాప్ టాక్ వచ్చింది. జనాల్లో నెగెటివ్ టాక్ వినిపించింది. అయినా ఈ సినిమాని జనాలు ఆమాత్రం అయినా ఆదరించారంటే నిఖిల్ వల్లనే. అతడిలోని ఎక్స్పెరిమెంటల్ యాటిట్యూడ్ వల్లనే. ఇమేజ్ ఓ రేంజులో పెరిగిందనడానికి ఇదే నిదర్శనం.