ఓ పక్క తమిళనాడు రాష్ట్రం మొత్తం వరదల్లో కొట్టు మిట్టాడుతోంది. చెన్నై నగరం సముద్రంలా మారి జన జీవనాన్ని స్తంభింపజేసింది. ఉపశమనం ఏమిటంటే, ఈ రోజుతో వర్షాలు మొత్తంగా ఆగిపోయే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ సంకేతాలు పంపింది. అంటే మరో రెండు రోజుల్లో అంతా మామూలు పరిస్థితికి రావొచ్చు. ఎంతయినా మనలాగే మరి అరవం జనాలు కూడా సినిమా పిపాసులే కదా. తిండికి తిప్పలున్నా సినిమాలు మాత్రం వదలరు. అందుకే దొరికిందే అదునుగా ఈ నెల పదకొండున రిలీజు కాబోయే సినిమాలకు అప్పుడే ప్రమోషన్లు మొదలెట్టారు. మరీ ముఖ్యంగా మన రామ్ చరణ్, అల్లు అర్జున్ నటించిన ఎవడు సినిమాను అక్కడ అరవంలో మగధీర పేరుతో డబ్ చేసి పదకొండో తారీఖున రిలీజు ప్లాన్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ పెద్ద స్థాయిలో అధిక మొత్తాన్ని తమిళనాడు ముఖ్య మంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చిన సంగతి కూడా విదితమే. తమిళులు మన మగదీరని వరదల్లో కూడా ఆదరిస్తారా లేక నామ్ కే వాస్తే ఇది ఇలా వచ్చి అలా పోయే సినిమా అవుతుందో వేచి చూద్దాం!