శ్రీను వైట్ల, కోన వెంకట్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరుకున్నాయి అభిప్రాయబేధాలు. సెలబ్రిటీలు కాబట్టి ఎంతలా తగ్గి ఉంటె అంత మంచిది అన్న విషయాన్ని మరిచి ఒకరి మీద ఇంకొకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నారు. సినిమా అనేది ఒక మీడియం అన్న సంగతిని మరిచి ఇప్పుడు కోన గారు శ్రీను మీదున్న కోపాన్ని మొత్తం శంకరాభరణం సినిమాలోని ఓ డైరెక్టర్ పాత్రలో నటించిన కృష్ణ భగవాన్ ద్వారా తీర్చేసుకున్నాడు. కథానుసారం స్టార్ హీరోగా వెలుగుతున్న భజరంగి (ఆర్టిస్టు గిరిధర్) బీహారులో కిడ్నాప్ అవడంతో, అతని నిర్మాత సరాసరి కిడ్నాపర్ల డెన్ వద్దే షూటింగ్ ప్లాన్ చేసుకుని డైరెక్టర్ (ఆర్టిస్టు కృష్ణ భగవాన్) గారిని అక్కడికే ఆహ్వానిస్తాడు. ఇక్కడ కృష్ణ భగవాన్, నిఖిల్ మధ్య వచ్చే సంభాషణల్లో ఎక్కువ శాతం వైట్లను ఉద్దేశించి రాసినవేనని యిట్టె తెలిసిపోతుంది. ఒకానొక సమయంలో, మా పెళ్ళాలతో కూడా సరిగ్గా కాపురం చేయకుండా క్రియేటివిటి మీద కూర్చుంటాం అని కృష్ణ భగవాన్ అంటుంటే శ్రీను వైట్ల, రూప వైట్ల మధ్య జరిగిన కాంట్రవర్సరీ గుర్తు రాకుండా ఉండదు. ఇలాంటి పర్సనలు వివాదాలను సినిమాలలో వాడుకునే సంస్కృతి ఇంతకు మునుపు వైట్ల గారు ప్రకాష్ రాజ్ మీద రాసిన ఆగడు డైలాగుల్లో ధ్వనించింది. ఇప్పుడు వైట్ల దగ్గరే ఆ విద్యను అభ్యసించిన కోన, ఏకంగా గురువు మీదే అస్త్రం ఎక్కుపెట్టాడు