Advertisementt

అఖిల్ బాబును ఎంతకు కొన్నారో?

Sat 05th Dec 2015 04:34 PM
akhil,south india shopping mall,mahesh babu,titan  అఖిల్ బాబును ఎంతకు కొన్నారో?
అఖిల్ బాబును ఎంతకు కొన్నారో?
Advertisement
Ads by CJ

మొదటి సినిమా రిలీజు కాకముందే బ్రాండ్ ఎండార్స్ మెంట్లతో సంపాదన మీద పడిన కుర్ర హీరో అక్కినేని అఖిల్ తాజాగా మరో కంపెనీతో టై-అప్ అయ్యారు. ఇప్పటికే మౌంటెన్ డ్యూ, టైటాన్, బ్లూ క్రాస్, కార్బన్ మొబైల్స్ ఎండార్స్ చేస్తున్న అఖిల్ ఈసారి మహేష్ బాబు చేస్తున్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారితో అగ్రిమెంట్ సైన్ చేసారు. సినిమా హీరోలు ప్రకటనల్లో బిజీ అయిపోవడం కొత్త కాకపోయినా ఇప్పుడిప్పుడే సినిమాల్లో బుడి బుడి అడుగులు వేస్తున్న అఖిల్ మరి రెండు పడవల మీద కాళ్ళు పెట్టి బ్యాలెన్స్ చేసుకుంటాడా అన్నది ఆశ్చర్యం. రెండేళ్ల క్రితం మహేష్ బాబుతో ఒప్పందం కుదుర్చుకుని అతనికి బ్రాండ్ అంబాసిడరుగా సుమారు ఏడు కోట్లు చదివించుకున్న షాపింగ్ మాల్ మరి అఖిల్ బాబుని ఎంతిచ్చి కొనుక్కుంది అన్నది అఫీశియలుగా తెలియలేదు. ఏదేమైనా డెబ్యు సినిమా ఫ్లాపయినా అఖిల్ వ్యాల్యూ తగ్గలేదు అన్నది నిజం! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ