బ్రూస్ లీ సినిమా అనుకున్న దానికన్నా బాక్సాఫీస్ వద్ద ఎక్కువ పరాజయాన్ని చవిచూడటంతో, హీరో రామ్ చరణ్ అండ్ దర్శకుడు శ్రీను వైట్లది ఆల్మోస్ట్ ఒకే పరిస్థితి. ఇద్దరూ తమ తమ తదుపరి సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. చరణ్ కోసం తని ఒరువన్ తెలుగు రీమేక్ మీద సురేందర్ రెడ్డి పని చేస్తుంటే పాపం శ్రీను వైట్ల మాత్రం ఏ హీరోను బుట్టలో వేయాలా అని ఆలోచిస్తున్నాడు. ఒకానొక సమయంలో పోతినేని రామ్ రెడీగా ఉన్నాడని వార్తలొచ్చాయి. అటు తరువాత మహేష్ బాబును కూడా అప్రోచ్ అయినట్టు తెలిసింది. తాజాగా వైట్ల గారు దగ్గుబాటి రానాకు ఓ కథను వినిపించారని టాక్. అంతా బాగానే ఉందన్న రానా ముందుగా స్క్రిప్టు తయారు చేసుకుని వస్తే కాల్షీట్ల గురించి చర్చిద్దామని చెప్పారట. రానా ద్వారా గతించిన పూర్వ పూర్వవైభవాన్ని పొందాలన్న వైట్ల ఆలోచన బాగానే ఉన్నా రానా తండ్రి సురేష్ బాబును ఒప్పించడం అంత వీజీ కాదని అంటున్నారు సినీ జనాలు. బాహుబలితో రానా ప్రతిష్టను తారా స్థాయికి తీసుకెళ్ళిన సురేష్ బాబు మరి శ్రీను వైట్లతో ప్రాజెక్టు అంటే సవా లచ్చ కండిషన్లు పెట్టకుండా ఉంటాడా. అవన్నీ పొందు పరిచేలా స్క్రిప్టు తయారు చేయాలంటే వైట్లకు ఇప్పట్లో సాధ్యం అవుతుందా? పూర్తి వివరాలు తెలిస్తే గాని భల్లాలదేవ, వైట్ల కలయిక పట్ల ఓ క్లారిటీకి రాలేము.