సౌత్‌లో లేడీ సూపర్‌స్టార్‌గా ఎదిగిన అనుష్క విభిన్నమైన సినిమాలు చేస్తూ దూసుకెళ్లుతోంది. 'వర్ణ, బాహుబలి, రుద్రమదేవి' వంటి సినిమాలకు అనుష్క తప్ప వేరే ఆప్షన్ లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం హైరేంజ్‌లో దూసుకెళుతోన్న ఆమె 'సైజ్‌జీరో' వంటి చిత్రాలు చేయడానికి కూడా వెనుకంజ వేయటం లేదు. ఈమద్య పలువురుస్టార్ హీరోలు రెమ్యూనరేషన్ తీసుకోకుండా సినిమా లాభాలలో వాటా తీసుకొంటున్న సంగతి తెలిసిందే. పవన్, మహేష్, ప్రభాస్ వంటి స్టార్స్ రెమ్యూనరేషన్ బదులు ఆయా సినిమాలలో వాటాను దక్కించుకొంటున్నారు. తాజాగా 'సైజ్‌జీరో' విషయానికి వస్తే అనుష్క కూడా అదే చేసింది. ఆమెకు రెండు కోట్లు పారితోషికం ఇవ్వడానికి పివిపి సంస్థ ఓకే చేసినప్పటికీ ఆమె దానికి నో చెప్పి ఆ సినిమా నిర్మాణంలో ఆ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టింది. సినిమా బాక్సాఫీస్ వద్ద బాగా ఆడితే అనుష్కకు లాబాల్లో వాటా దక్కేది. అయితే ఈ చిత్రం కలెక్షన్లపరంగా తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో అనుష్కకు ఒక్క పైసా కూడా దక్కలేదట. వాస్తవానికి ఈచిత్రం కోసం అనుష్క చాలా కష్టపడింది. దాదాపు 20కేజీలు బరువు పెరిగింది. ఇప్పుడు మళ్లీ ఆ బరువు తగ్గించుకోవడానికి తీవ్రంగా కష్టపడుతోంది. మొత్తానికి 'సైజ్‌జీరో' సినిమా వల్ల అనుష్కకు విలువైన సమయం వృథా కావడంతో పాటు రెండు కోట్ల రెమ్యూనరేషన్ కూడా పోగొట్టుకుంది.