Advertisementt

అంజలి యవ్వారం మరీ జోరుగా ఉంది..!

Fri 04th Dec 2015 04:05 PM
anjali,dictator movie,manchu vishnu,sarada movie,50 lakhs remuneration  అంజలి యవ్వారం మరీ జోరుగా ఉంది..!
అంజలి యవ్వారం మరీ జోరుగా ఉంది..!
Advertisement
Ads by CJ

హీరోయిన్‌ అంజలి.. మంచి టాలెంట్‌ ఉన్న నటి. తన నటనతో ఏ పాత్రకైనా న్యాయం చేయగలిగిన నటి. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో కూడా మంచి గుర్తింపు ఉన్న హీరోయిన్‌. ప్రస్తుతం ఆమె టాప్‌ అండ్‌ స్టార్‌ హీరోయిన్‌ కాకపోయినా రెమ్యూనరేషన్‌ మాత్రం భారీగానే వసూలూ చేస్తోంది. కొన్ని పాత్రలకు అంజలి అయితేనే పర్‌ఫెక్ట్‌గా సూటవ్వుతుందనే పేరు ఉండటంతో ఆమెకు పలు మీడియం, లో బడ్జెట్‌ చిత్రాల్లో ప్రత్యేక గీతాలు, కీలకమైన రోల్స్‌ వెత్తుకుంటూ వస్తున్నాయి. వారి నుండి మాత్రం అంజలి ముక్కుపిండి భారీ పారితోషికాలు చార్జ్‌ చేస్తోంది. తాజాగా ఆమె 'శంకరాభరణం' చిత్రంలో కూడా కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. కాగా ఆమెకు తాజాగా మంచు విష్ణు హీరోగా రూపొందుతున్న 'సరదా' చిత్రంలో కీలకమైన పాత్రకు తీసుకున్నారు. మొదట ఈ పాత్రను అమలాపాల్‌, కేథరిన్‌ వంటివారితో చేయించాలని భావించారు. కానీ కథాపరంగా కీలకమైన పాత్ర కావడం, దానికి అంజలి అయితేనే పర్‌ఫెక్ట్‌గా సూటవుతుందని భావించిన దర్శకనిర్మాతలు ఆమెను సంప్రదించారు. ఈ చిత్రంలో ఆమె పాత్రను చిత్రీకరించడానికి కేవలం 10రోజుల డేట్స్‌ మాత్రమే కావాల్సివచ్చాయి. దీని కోసం అంజలి ఏకంగా 50లక్షలు డిమాండ్‌ చేసి సాధించుకొందట. తన పాత్ర చిత్రీకరణ ఒక్కరోజు పెరిగినా కూడా రోజుకు ఐదు లక్షల చొప్పున చెల్లించాల్సిందే అని తేల్చేసిందట అంజలి. అంటే రోజుకు అంజలి చార్జ్‌ చేస్తున్న మొత్తం ఐదులక్షలు. ఇంత డిమాండ్‌ స్టార్‌హీరోయిన్ల కంటే ఎక్కువగా ఉందని దర్శకనిర్మాతలు భావించినప్పటికీ రాజీ పడి అంత మొత్తానికి ఒప్పుకోకతప్పలేదు. కాగా ఆమె ప్రస్తుతం బాలకృష్ణ సరసన 'డిక్టేటర్‌' చిత్రంలో మెయిన్‌హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కనుక హిట్‌ అయితే ఆమె డిమాండ్‌ మరింతగా పెరగడం ఖాయం అంటున్నారు. సీనియర్‌స్టార్స్‌ సరసన నటించే హీరోయిన్లకు కొరత ఏర్పడటం... అలాంటి వారి సరసన నటించేందుకు ఆమె సిద్దంగా ఉండటంతో ఈ డిమాండ్‌ ఎంతవరకు సాగుతుందో అని నిర్మాతలు తలలు పట్టుకొంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ