Advertisementt

అవికా అవుట్ కుమారి ఇన్..!

Fri 04th Dec 2015 03:29 PM
hebah patel,raj tarun,kumari 21f,manchu vishnu,nageshwar reddy,avika gor  అవికా అవుట్ కుమారి ఇన్..!
అవికా అవుట్ కుమారి ఇన్..!
Advertisement
Ads by CJ

'కుమారి 21ఎఫ్‌' మూవీలో జంటగా నటించిన రాజ్‌తరుణ్‌, హేబా పటేల్‌ తెరపై రొమాంటిక్‌ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్‌ అయ్యారు. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా ఖరారైందని సమాచారం. విషయానికి వస్తే దర్శకుడు జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఇందులో మంచు విష్ణుతోపాటు రాజ్‌తరుణ్‌ కూడా హీరోగా నటిస్తున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మొదట రాజ్ తరుణ్ సరసన అవికా గోర్ ను ఎంపిక చేసారు. కాని 'కుమారి 21ఎఫ్‌'లో హేబా పటేల్ పెర్ఫార్మెన్స్‌ చూసి ఇంప్రెస్‌ అయిన దర్శకనిర్మాతలు ఈ సినిమాలో ఆమెకు చాన్స్‌ ఇచ్చారు. మరోసారి జత కడుతున్న ఈ హిట్ కాంబినేషన్ ఎంత పెద్ద సక్సెస్ అవుతుందో.. వేచి చూడాల్సిందే..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ