తన కెరీర్‌ను ఓ అట్టర్‌ఫ్లాప్‌తో మొదలెట్టిన దర్శకుడు విక్రమ్ కె.కుమార్. అది ఆయన తొలి చిత్రం 'ఇష్టం'. ఇదో రొటీన్ స్టోరీ. కాగా ఆయన వరుస ఫ్లాప్‌ల్లో ఉన్న నితిన్‌కు 'ఇష్క్' వంటి సూపర్‌హిట్‌ను అందించి నితిన్‌తోపాటు తనకు కూడా మంచి పేరు సంపాదించుకోగలిగాడు. ఈ రెండు చిత్రాలు మాత్రమే ఆయన కెరీర్‌లో రొటీన్ చిత్రాలు. మిగిలిన '13బి, మనం'తో పాటు తాజాగా తమిళస్టార్ సూర్యతో చేస్తున్న '24' కూడా విభిన్నమైన చిత్రాలే. ముఖ్యంగా ఇవ్వన్నీ కాలంతో ముడిపడిన చిత్రాలే కావడం విశేషం.'13బి' చిత్రంలో ప్రస్తుత కాలానికి, 30ఏళ్ల కిందట జరిగిన హత్యలకు ముడిపెడుతూ సాగే సీరియల్‌తో ఈ చిత్రం సాగుతుంది. ఇక 'మనం' చిత్రం గురించి కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఆయన అక్కినేని కుటుంబానికి ఇచ్చిన మరపురాని, మరిచిపోలేని చిత్రం. ఇది కూడా పునర్జన్మల నేపథ్యంలో సాగే సినిమానే కావడం విశేషం. ఇక తాజాగా ఆయన తీస్తున్న '24' చిత్రం కూడా టైమ్‌మెషీన్‌కు చెందిన కాలంతో పాటు జరిగే కథే కావడం విశేషం. ఈ చిత్రంలో సూర్య మూడు విభిన్నపాత్రలు చేస్తున్నాడు. అందులో ఒకటి కామన్‌మేన్ పాత్ర కాగా, మరోటి సైంటిస్ట్ పాత్ర. మూడోది మాత్రం 'ఆత్రేయ' అనే పేరుగల విలన్ పాత్ర. టైం మెషీన్ సహాయంతో గతకాలానికి వెళ్లి అక్కడ తాను పూర్వం చేసిన తప్పులను సరిదిద్దుకునే పాయింట్‌తో ఈచిత్రం తెరకెక్కుతోంది. మరి విక్రమ్ కె.కుమార్ తనకు అచ్చివచ్చిన 'కాలం' కథల సెంటిమెంట్‌ను '24'తో మరోసారి రిపీట్ చేస్తాడేమో వేచిచూడాలి...!