Advertisementt

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్ హవా..!

Thu 03rd Dec 2015 07:43 PM
ntr,sukumar,nannaku prematho,nizam,overseas business,eight crores  యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్ హవా..!
యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్ హవా..!
Advertisement
Ads by CJ

వరస ఫ్లాప్‌లు ఇచ్చినా ఎన్టీఆర్‌ రేంజ్‌ ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతి సినిమాకీ విపరీతమైన హైపు క్రియేట్‌ అవుతూనే ఉంది. ఎన్టీఆర్‌కు ఓ హిట్‌ పడాలే గానీ బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు షేకైపోతాయన్నది బయ్యర్ల నమ్మకం. అదే నమ్మకమే 'నాన్నకు ప్రేమతో' సినిమాకి బాగా హెల్ప్‌ అవుతోంది. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 8వ తేదీన విడుదలకు సిద్దమౌతున్న సంగతి తెలిసిందే. కాగా ఈచిత్రం ఆడియోను ఈ నెల 23న గ్రాండ్‌గా జరపాలని ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకి బిజినెస్‌ ఇప్పటినుంచే మొదలైపోయింది. నైజాంలో దాదాపు 8కోట్లకు ఈ సినిమాను అమ్మారని తెలుస్తోంది. ఓవర్‌సీస్‌లో కూడా ఇంచుమించుగా ఈ రేటే గిట్టిందట. దాదాపుగా ఇప్పటివరకు 40 కోట్ల వరకు బిజినెస్‌ జరిగిందని, మరో 10కోట్లు వరకు ఈజీగా దాటుతుందని, ప్రీరిలీజ్‌కి 'నాన్నకు ప్రేమతో' చిత్రం 50కోట్ల బిజినెస్‌ను పూర్తి చేస్తుందని ట్రేడ్‌ వర్గాల అంచనా. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ