భారీ ఫ్లాప్.. బడా బడా నిర్మాణ సంస్థల ఆఫీసులకు కూడా తాళం వేయిస్తుంది. అలాంటిది పివిపి సంస్థకు రెండు దెబ్బలు తగిలాయి. అప్పుడొచ్చిన 'వర్ణ' తో దాదాపు 40కోట్లు పోయాయి. మొన్నటికి మొన్న 'సైజ్‌జీరో' కూడా పివిపికి పెద్ద మొట్టికాయ వేసింది. పెట్టుబడి ఆసాంతం పోయిందని, కనీసం 15 నుండి 20కోట్లు వరకు నష్టాలు భరించాల్సివస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా. దీంతో ఈ సంస్థ నిర్మిస్తున్న 'ఊపిరి, బ్రహోత్సవం' చిత్రాలపై ఈ సంస్థ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఎన్ని కోట్లకు పడగలెత్తిన సంస్థ అయినా ఇలాంటి నష్టాలను చవిచూడటం పెద్ద రిస్కే అని చెప్పాలి. ఇంతకాలం బయటివారి సినిమాలకు ఫైనాన్స్ చేస్తూ వస్తున్న ఈ సంస్థ ప్రస్తుతం 'బ్రహ్మూెత్సవం' షూటింగ్ కోసం బయటి ఫైనాన్షియర్స్ నుండి 25కోట్లు తీసుకొందని సమాచారం. మరి మహేష్, నాగార్జున, కార్తిలు ఈ నిర్మాతను ఒడ్డున పడేస్తారో లేదో వేచిచూడాల్సివుంది..!